Chanakya Niti : ఆచార్య చాణక్య మనుషులు, మనుషులు యొక్క మనస్తత్వాలు గురించి ఎన్నో విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు, మనం పాటించడం వలన, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉండొచ్చు. ఇలాంటి వైఖరి ఉన్నవాళ్లు, మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని, మోసపోవాల్సి ఉంటుందని చాణక్య అన్నారు. మరి ఎటువంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి..? ఎటువంటి వాళ్ళతో దూరంగా ఉంటే మంచిది అనే విషయాన్ని చూద్దాం.
అవసరమైనప్పుడు సహాయం చేయని వాళ్ళు, ఎప్పుడు నమ్మకూడదని ఆచార్య చాణక్య చెప్పారు. సహాయం చేసే పరిస్థితులు ఉండి కూడా, సహాయం చేయలేకపోతున్నట్లయితే, కచ్చితంగా అటువంటి వాళ్ళని నమ్మకూడదని, ఆచార్య చాణక్య చెప్పడం జరిగింది. అలానే, చాణక్య ప్రకారం మన ముందు ఒకలా వెనక ఒకలా మాట్లాడే వ్యక్తులతో దూరంగా ఉండాలని చాణక్య అన్నారు.
అటువంటి వాళ్ళని నమ్మకూడదు. అటువంటి వాళ్ళు ఏదైనా చెప్పాలంటే కచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి, ఇటువంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొంతమంది, ముందు ఒక లాగ వెనక ఒకలా మాట్లాడుతుంటారు. ఈ స్వభావం అసలు మంచిది కాదు. అలానే, మరొక లక్షణం కూడా ఉంది. ఇటువంటి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా మీరే ఇబ్బంది లో పెడతారు. కొంతమంది పని అయిపోయే వరకు ఒకలా, పని అయిపోయిన తర్వాత ఒకలా ఉంటారు.
అటువంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పని అయ్యేవరకు మీరే అని అంటారు. పనైపోయిన తర్వాత మీరు ఎవరు అంటారు. ఇటువంటి వ్యక్తులకి దూరంగా ఉండకపోతే, అనవసరంగా మీరే ఇబ్బందుల్లో పడతారు. ఇటువంటి వాళ్ళు, అచ్చమైన స్వార్థపరులు, అవకాశవాదులు. అలాంటి వారికి ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలని చాణక్య చెప్పారు. చూశారు కదా, చాణక్య చెప్పిన విషయాలని, మరి చాణక్య చెప్పినట్లు చేసినట్లయితే, ఎటువంటి వారి దగ్గర మోసపోరు. ఆనందంగా ఉండొచ్చు. లేదంటే అనవసరంగా మీరే ఇబ్బందులు పడాలి.