Sit On Floor : సాధారణంగా ఇళ్లలో చాలా మంది భోజనం చేసేటప్పుడు నేలపై కూర్చుంటారు. డైనింగ్ టేబుల్ సదుపాయం ఉండేవారు కుర్చీలపై కూర్చుని తింటారు. ఇక కొందరు మంచాలపై, సోఫాల్లో కూర్చుని భోజనం చేస్తుంటారు. అయితే నేలపై కూర్చుని భోజనం చేసేవారు మాత్రం ఒక నియమాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నేలపై కూర్చుని భోజనం చేసేటప్పుడు నేలపై కచ్చితంగా పీట, చాప, వస్త్రం వంటి వాటిలో ఏదో ఒక దాన్ని వేసుకుని దానిపై కూర్చుని మాత్రమే భోజనం చేయాలి. కటిక నేలపై అస్సలు కూర్చోరాదు. కేవలం భోజనం చేసేటప్పుడు మాత్రమే కాదు, అసలు ఎప్పుడు నేలపై కూర్చున్నా.. కింద ఏదో ఒకటి వేసుకుని దానిపై కూర్చోవాలి. అంతేకానీ.. కటిక నేలపై కూర్చోరాదు.
మన శరీరంలో సహజంగానే విద్యుత్ ప్రవహిస్తుంటుంది. విద్యుత్ ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. అయితే నేలపై ఏమీ వేసుకోకుండా కటిక నేలపై అలాగే కూర్చుంటే మన శరీరంలో నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ బయటకు పోతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకని నేలపై ఎప్పుడైనా సరే.. దేనికోసమైనా సరే.. కూర్చుంటే.. కచ్చితంగా ఏదో ఒకటి వేసుకుని దానిపై మాత్రమే కూర్చోవాలి. అంతేకానీ.. కటిక నేలపై కూర్చోరాదు.