అల్లర్లు, గొడవలతో రోజును ఎవరైనా ప్రారంభిస్తే వారికి ఇక ఆ రోజంగా చికాకుగా ఉంటుంది. ఏ పనీ చేయబుద్ది కాదు. ఇక ఉద్యోగులైతే దాని ప్రభావం వారి పనిపై పడుతుంది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల నుంచి మొట్టికాయలు కూడా పడవచ్చు. అయితే ఇలా మాత్రం రోజును ఎవరూ ప్రారంభించాలని కోరుకోరు. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంచుకుని రోజును ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇదే కాదు, ఇప్పుడు మేం చెప్పబోయే కింది సూచనలను రోజు ప్రారంభంలో పాటిస్తే దాంతో లక్ కలసి వస్తుంది. అంతా శుభమే జరుగుతుంది. ఉద్యోగులైతే కెరీర్‌లో ముందుకు సాగుతారు. ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు కొద్దిగా బెల్లం తిని నీటిని తాగాలి. అనంతరం బయటికి వెళ్లాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి శక్తి అందడమే కాదు, రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దాంతోపాటు పాజిటివ్ ఎనర్జీ వెన్నంటి ఉంటుంది. అప్పుడు ఏ పని చేసినా విజయం సిద్దిస్తుంది. అంతా మంచే జరుగుతుంది.
ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. అలా తీసుకునే క్రమంలో వంగుతారు కనుక, ఆ స్థితిలో రక్త సరఫరా మెదడుకు ఎక్కువగా జరిగి ఆ భాగం షార్ప్ అవుతుంది. దీంతో ఆలోచనా శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల పితృ దోషం పోతుందట. దీంతో అదృష్టం కలసి వస్తుందట. పెద్ద వాళ్ల ఆశీస్సులు తీసుకుని ఇంటి నుంచి వెళితే అంతా మంచే జరుగుతుందట. నెగెటివ్ ఎనర్జీ నుంచి బయట పడవచ్చట. ఉదయం నిద్రలేవగానే ఎవరి అరచేతులను వారు చూసుకోవాలి. రెండు అరచేతులను దగ్గరగా పెట్టి ఆ పనిచేయాలి. ఇలా చేయడం వల్ల చేతి వేళ్ల చివర్లో ఉండే లక్ష్మీదేవి, మధ్యలో ఉండే సరస్వతీ దేవి, మణికట్టు వద్ద ఉండే బ్రహ్మ, ఈ ముగ్గురి ఆశీస్సులు మనకు లభిస్తాయట. దీంతో విద్య, జ్ఞానం, ధనం అన్నీ సమకూరుతాయట.
దంపతులు తమ తమ బెడ్ రూంలలో అద్దాలను అస్సలు పెట్టుకోరాదు. అలా చేయడం వల్ల వారి వైవాహిక జీవితం దెబ్బ తింటుందట. అన్నీ సమస్యలే కలుగుతాయట. అలా అద్దం పెట్టుకుని ఉదయాన్నే చూస్తే ఇక అంతా అశుభమే జరుగుతుందట. ఏదీ కలసి రాదట. డిప్రెషన్, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు ఒకసారి తాము నిద్రిస్తున్న ప్రదేశానికి అపోజిట్‌గా అద్దం ఉందో లేదో చెక్ చేయాలి. ఒక వేళ అద్దం ఉంటే వెంటనే దాన్ని తీసేయాలి. అలా కుదరకపోతే ఆ అద్దాన్ని గుడ్డతో కప్పేయాలి. దీని వల్ల ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలాంటి వారు పొద్దున్నే అలాంటి అద్దాలను అస్సలు చూడకూడదు.