సమాజంలో జైనీయులకు ఎంతో గౌరవం ఇస్తారు. వారికి ఈ ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు. అయితే.. నిజానికి జైనీయులు మాంసాహారం అస్సలు తీసుకోరు. మరి కొంతమంది ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తీసుకోరు. ఇవి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కూడా బ్రాహ్మణుల తరహాలోనే జైనీయులు దానిని తీసుకోవడానికి వెనుకడుగు వేస్తారు. తినటానికి అస్సలు ఇష్టపడరు.
వంటలలో కూడా ఇవి వేయకుండానే, వండుకొని తింటారు. నిజానికి ఉల్లిపాయ, వెల్లుల్లిలో గంధకం ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీటి నుండి వాసన కూడా ఎక్కువగా వస్తుంది. అందువల్ల వీటిని తీసుకోవడం, నాలుకపై వాటి తాలూకు వాసన ఎక్కువసేపు ఉంటుందట. మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ వాసన వస్తూ ఉంటుందట. అందుకే జైనీయుల కుటుంబాల్లో ఆహార నియమాలు, నిష్టలు పాటిస్తారట.
అంతే కాదు జైనమతం అత్యంత అహింసా మతం. ఒక జీవిని లేదా జంతువును చంపడాన్ని ఇష్ట పడరు. అంతే కాదు హింసను నివారించడానికి చర్యలు కూడా తీసుకుంటారు. ఇక ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి కూరగాయలు తామసిక్ విభాగంలోకి వస్తాయి. ఈ రకమైన కూరగాయలు భూగర్భంలో పెరుగుతాయి. అంతే కాదు నేల కింద నివసించే అనేక కనిపించని జీవులకు ఇవి నిలయం. ఈ జీవులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు, జైనులు ఉల్లిపాయలు, వెల్లుల్లి తినరు. కొన్ని జైన కుటుంబాలు అయితే జామ, వంకాయ వంటి కూరగాయలను కూడా తినరు. ఎందుకంటే వాటిలో పురుగులు ఉంటాయి. కాలీఫ్లవర్‌ను కూడా తినేముందు చాలా జాగ్రత్తగా శుభ్రం చేసి తింటారు.