Gents Bath : మనం రోజూ అనేక పనులను చేస్తూ ఉంటాము. మనం చేసే ఈ పనులల్లో మనకు తెలిసీ, తెలియక అనేక తప్పులు జరుగుతూ ఉంటాయి. ఈ తప్పుల కారణంగానే మనం మన జీవితంలో వచ్చే కష్టాలను, నష్టాలను భరించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. మనం చేసే కర్మలకు అనుసారంగానే మన జీవితంలో సుఖ సంతోషాలు, కష్టనష్టాలు వస్తాయని వారు చెబుతున్నారు. రోజూ వారి జీవితంలో తెలియకుండానే పురుషులు చేసే అది పెద్ద తప్పు… దాని కారణంగా లభించే ఫలితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతి ఒక్కరూ రోజూ స్నానం చేస్తూ ఉంటాము. పాతకాలంలో అయితే పురుషులు నదులకు, కాలువలకు, చెరువుల దగ్గరికి స్నానం చేసేవారు. వారు స్నానం చేసేటప్పుడు ఒక టవల్ ను కట్టుకుని స్నానం చేసే వారు. కానీ నేటి తరుణంలో ఎవరి బాత్ రూమ్ లో వారే స్నానం చేస్తున్నారు. ఎవరూ చూడడం లేదు అనే ఉద్దేశ్యంతో చాలా మంది పురుషులు నగ్నం చేస్తూ ఉంటారు. స్నానం చేసిన తరువాత టవల్ తో శరీరాన్ని తడుచుకుని దుస్తులు ధరిస్తూ ఉంటారు. ఇంకొందరు పురుషులైతే స్నానం చేసి తుడుచుకున్న టవల్ నే కట్టుకుని పూజ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేసే పూజ ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదని పండితులు చెబుతున్నారు. మగవారు స్నానం చేసేటప్పుడు తప్పకుండా టవల్ కట్టుకుని స్నానం చేయాలి.
స్నానం చేసిన తరువాత మరో టవల్ తో తుడుచుకుని బట్టలు ధరించి ఆ టవల్స్ ను పిండి ఆరబెట్టాలి. ఆ తరువాతే పూజ చేయాలి. మగవారు ఒంటిపై నూలు పోగు లేకుండా స్నానం చేస్తే అది ఒక సంవత్సరం పాటు గోవధ చేసినంత పాపంతో సమానమని పండితులు చెబుతున్నారు. అలాగే మగవారు శరీరంపై నూలు పోగు లేకుండా చేసే స్నానం శవస్నానంతో సమానమని కూడా వారు చెప్పారు. కనుక మగవారు ఇష్టం ఉన్నా లేకున్నా అలాగే బాత్ రూమ్ లో చేసినా, బయట చేసినా నడుము చుట్టూ టవల్ ను కట్టుకున్న తరువాత మాత్రమే స్నానం చేయాలని, అలా చేయడం వల్ల మాత్రమే ఎటువంటి దోషం ఉండదని పండితులు చెబుతున్నారు.