సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల ముందు అనేక విధాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటిని పిల్లలు వింటూనే ఉంటారు. ఆ విధంగానే వారి అలవాట్లు కూడా వస్తాయి. మనం పిల్లల ముందే కుటుంబ సభ్యులను వివిధ రకాలుగా తిట్టడం, నోటికి వచ్చినట్టు బూతులు అనడం, పెద్దగా అరవడం లాంటివి చేస్తూ ఉంటాం.
దీనివల్ల కూడా పిల్లలు మనల్ని గమనిస్తూ నేర్చుకుంటారు. అదే మనం చెప్పేదేదో నెమ్మదిగా ఎలాంటి బూతులు వాడకుండా చెబితే మనకు బాగుంటుంది ఇంట్లో ఉన్నవారికి కూడా మంచి అలవాట్లు వస్తాయి. ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు మన స్థాయి లో మాట్లాడాలి, ఒక్కోసారి చిన్న పిల్లల్లాగా మరి వారికి అర్థమయ్యే రీతిలో కూడా మాట్లాడాలి.
మన ఇంట్లో పిల్లలకు ఏదైనా హోం వర్క్ చేయించడానికి కూర్చుంటాం. ఒక్కోసారి పిల్లలకు అర్థం కాకపోతే మళ్లీ మళ్లీ చెబుతాం. అయినా వారికి అర్థం కాకపోతే ఇక చెప్పే ఓపిక మనకు ఉండదు. ఈ సమయంలో పిల్లలను నీకు ఎంత చెప్పినా అర్థం కాదా, తెలివి లేదా, నీకు ఆ సబ్జెక్టులో ఏమీ రాదు, ఇలాంటి పదాలు మాట్లాడుతూ ఉంటాం. ఈ పదాలను పిల్లలు త్వరగా పట్టేసుకుంటారు. ఓహో నాకు బుర్ర లేదు మ్యాథ్స్ సబ్జెక్టు రాదు. ఇక వారు ఫిక్స్ అవుతారు. పిల్లలకు చేసే అంత తెలివి ఉన్న ఆ సబ్జెక్ట్ పై ఇంట్రెస్ట్ మాత్రం చూపించక నాకు రాదు అనే ఫీలింగ్ లోనే ఉంటారు. తల్లిదండ్రులు ఇంట్లో ఇది అమ్మాయిల పని, ఇది అబ్బాయిల పని, ఇది నువ్వు చేసే పని కాదు జెండర్ డిస్పరిటీ అనేది చూపిస్తూ ఉంటారు.
వంట గదిలో చిన్న పిల్లలు ఏదైనా న్యూడిల్స్ లాంటివి నేను చేస్తాను అని వస్తే ఇది అమ్మాయిల పని అబ్బాయిల పని కాదు అని అంటూ ఉంటారు. ఒకవేళ అమ్మాయి బైకు నేర్చుకుంటా అంటే బైకు అమ్మాయిలు నడపకూడదు. అబ్బాయిలు నడుపుతారు అని వైషమ్యాలు చూపించడం, ఆ విధంగా మాట్లాడడం వల్ల సమానత్వ భావనను తొలగిపోయి అబ్బాయి అంటే ఎక్కువ, అమ్మాయి అంటే తక్కువ అనే భావన వారిలో చిన్నప్పటినుంచే కలుగుతుంది. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని సమానత్వ భావన కలిగించాలని అదంతా తల్లిదండ్రుల పై ఆధారపడి ఉందని సైకియాట్రిస్టులు అంటున్నారు.