ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొకర్ని ప్రేమించాడు అంటే.. ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి ఎన్నో విధానాలు ఉంటాయి. కానీ ప్రేమ అంటే ఏమిటో ఒక కచ్చితమైన నిర్వచననాన్నిమాత్రం ఇప్పటి వరకు తత్వవేత్తలు గానీ, సైంటిస్టులు కానీ చెప్పలేకపోయారు. అయితే ప్రేమను 3 రకాల అంశాలు మాత్రం బాగా ప్రభావితం చేస్తాయట. అవేమిటంటే.. అభిరుచులు, సాన్నిహిత్యం, నిబద్దత. ఇవే మూడు అంశాల చుట్టూ ప్రేమ తిరుగుతుందట. వీటిని ఆధారంగా చేసుకునే పాటలు, పుస్తకాలు పుట్టుకొస్తున్నాయట. ఇదే విషయాన్ని రాబర్ట్ స్టెర్న్‌బర్గ్ అనే అమెరికన్ సైకాలజిస్టు చెబుతున్నారు. ఇక ఆయన 7 రకాల ప్రేమలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా!
1.ఇన్‌ఫ్యాచుయేషన్:
ఒక వ్యక్తిని చూడగానే మనలో కలిగే ఇష్టతనే ఇన్‌ఫ్యాచుయేషన్ అంటారు. ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఒకరి గురించి పూర్తిగా తెలియాల్సిన పనిలేదు. అలాగే ఇద్దరి అభిప్రాయాలు కూడా కలవాల్సిన పనిలేదు. కానీ ఇద్దరూ ఒకరితో ఒకరు కలసి జీవించేందుకు సుముఖంగా ఉంటారు. అదే ఇన్‌ఫ్యాచుయేషన్‌లో మార్పు వస్తే అలాంటి జంటల మధ్య ప్రేమ తక్కువగా ఉంటుంది.
2.లైకింగ్:
చాలా మంది ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఉండేందుకు ఇష్టతను ప్రదర్శిస్తారు. ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు తమ అభిప్రాయాలు, అభిరుచులను పంచుకుంటారు. అయితే ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఒక్కోసారి లవ్ సాధ్యం కాకపోతే ఇద్దరు వ్యక్తులు మంచి ఫ్రెండ్స్‌గానైనా ఉంటారట.
3.ఎంప్టీ లవ్ :
ఈ తరహా లవ్‌లో జంటల మధ్య కమిట్‌మెంట్ మాత్రమే ఉంటుంది. కానీ వారి అభిరుచులు కుదరవు. వారి మధ్య సాన్నిహిత్యం అంతగా ఉండదు. కానీ ప్రేమ ఉంటుంది. అయితే ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటే ఇద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది.
4.ఫ్యాచుయస్ లవ్:
ఈ తరహా ప్రేమలో ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉంటాయి. కమిట్‌మెంట్ కలిగి ఉంటారు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడినప్పుడు ఈ లవ్‌లో ఉన్నవారు పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే జంటల మధ్య సాన్నిహిత్యం ఉండదు. కానీ సంతోషంగా మాత్రం ఉంటారు. ఇలాంటి రిలేషన్ షిప్‌లను జంటలు ఎక్కువ కాలం కొనసాగిస్తారు. అయితే తమ జీవిత భాగస్వామిని మాత్రం వీరు ఫ్రెండ్ గా చూడలేరు.
5.రొమాంటిక్ లవ్:
ఈ లవ్‌లో జంటల అభిరుచులు, సాన్నిహిత్యం తదితర అంశాలను బట్టి వారి మధ్య బంధం ఏర్పడుతుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరి దగ్గర ఒకరు ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ కమిట్‌మెంట్ ఉండదు. అయితే ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు వివాహాలు చేసుకునేందుకు ఆసక్తిని చూపించరు.
6. కంపానియనేట్ :
ఈ లవ్‌లో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం, కమిట్‌మెంట్ ఉంటుంది. ఒకరికి ఒకరు మంచి ఫ్రెండ్ లా ఫీలవుతారు. ఇద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. అయితే ఈ లవ్‌లో ఒకరి అభిరుచులు మరొకరి అభిరుచులతో కలవవు. చాలా సంవత్సరాల పాటు కలసి ఉంటే గానీ ఈ తరహా లవ్ జంటల మధ్య ఏర్పడదు.
7. కన్‌జ్యుమేట్ లవ్ :
ఈ లవ్‌లో సాన్నిహిత్యం, అభిరుచులు కలవడం, కమిట్‌మెంట్ అన్నీ ఉంటాయి. అయితే ఈ అంశాల మధ్య సమతుల్యత ఉండదు. ఇలాంటి రిలేషన్‌షిప్‌లో ఉండే వారు మనకు చాలా తక్కువగా కనిపిస్తారు. కానీ ఇదే రిలేషన్‌షిప్‌ను ట్రూ లవ్‌గా చెప్పవచ్చు. ఈ లవ్‌లో ఉన్నవారి మధ్య అంతులేని ప్రేమ ఉంటుంది. ఈ లవ్‌లో ఉన్న జంటలు సంతోషంగా కలకలాం జీవిస్తాయి.
అయితే సైకాలజిస్టులు చెబుతున్న ప్రకారం.. లవ్ ను జీవితంలో ఎవరైనా ఒకేసారి అనుభవిస్తారట. అది కేవలం ఒక పార్ట్‌నర్‌తో మాత్రమే విజయవంతం అవుతుందట. అది కూడా చాలా భారీ స్థాయిలో ఉంటుంది. కానీ అదే లవ్ ఇతరులపై అంతగా ఉండదు. అయితే చాలా మంది రిలేషన్ షిప్స్ పైన చెప్పిన 7 రిలేషన్ షిప్స్‌లో దేనికి కూడా మ్యాచ్ అవకపోవచ్చు. కానీ వాటికి చెందిన లక్షణాలు మాత్రం ఆయా రిలేషన్ షిప్‌లలో ఉంటాయి.