రక్షణ కోసం చాలా మంది సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు కొన్ని రకాల సెక్యూరిటీలను ఇష్యూ చేస్తారు. అయితే తాజాగా ప్రభుత్వం సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ సెక్యూరిటీ ను ఇష్యూ చేసింది మరియు ప్రముఖ రాజకీయ నాయకుడు చిరాగ్ పాస్వన్ కు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ను అందించారు. సెక్యూరిటీ విభజనను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతగా వీటిని నిర్వహిస్తుంది.
ముఖ్యంగా హై ప్రొఫైల్ ఉన్న సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు వీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పవచ్చు. ఎక్స్ క్యాటగిరీ అనేది బేసిక్ లెవెల్ అని చెప్పవచ్చు. కొంత శాతం ప్రమాదం ఉంటే కనుక ఇద్దరు పోలీసులను సెక్యూరిటీగా పంపిస్తారు. వై క్యాటగిరీ కొంచెం ఎక్కువ రక్షణ ఇస్తుంది, 8 నుండి 11 మంది పోలీస్ ఆఫీసర్లను, కమాండోస్ ను పంపిస్తారు. అదే వై ప్లస్ సెక్యూరిటీ అయితే 8 నుండి 11 పోలీసుల తో పాటు కొంతమంది కమాండోస్ ను పంపిస్తారు. అయితే ముఖ్యంగా రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు రక్షణ కల్పించడానికి వై ప్లస్ సెక్యూరిటీను ఉపయోగిస్తారు.
జెడ్ కేటగిరి సెక్యూరిటీ మరింత రక్షణను కల్పిస్తుంది. 22 మంది పోలీసులను, నాలుగు నుండి ఐదు వరకు కమాండోస్ ను పంపిస్తారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ అన్నిటికంటే టాప్ క్యాటగిరి అని చెప్పవచ్చు. ఈ క్యాటగిరి లో 55 మంది పోలీసులను, కమాండోస్ ను పంపిస్తారు. వీరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి కి సంబంధించిన వారు.