వయసు వచ్చిన పిల్లలను తల్లి తండ్రి దగ్గర పడుకోబెట్టుకోకూడదు. పిల్లలు పెద్దవాళ్ళై మెచ్యూరిటీ అయితే ఎవరి మంచం మీద వాళ్లే పడుకోవాలి. ఇది శాస్త్రమే కాదు ప్రకృతి సహజం కూడా. వయసు వచ్చాక పిల్లలకు అప్పటిదాకా ఉన్న తల్లి తండ్రి గౌరవభావం పితృ స్వభావం వేరే కోరికల మీదకు వెళుతుంది. అటువంటివి పొరపాటున ఏదైనా చూస్తే వాళ్లలో వికారం మొదలవుతుంది. ఆ వికారమే వాళ్ళను నాశనం చేస్తుంది. పెడదారి పట్టిస్తుంది. అదే హార్మోన్ల ప్రభావం.
అమ్మాయిని అబ్బాయి చూసినా, అబ్బాయి అమ్మాయిని చూసిన వాళ్లకు వికారం కలుగుతుంది. ముసిమసి నవ్వులు నవ్వుకుంటారు. కారణం హార్మోన్ల ప్రభావం. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు తల్లి తండ్రి పక్కన పడుకోకుండా ఉండటం మంచిది. ఏ క్షణంలోనైనా ఎవరి బట్టలైనా పక్కకు వెళ్ళవచ్చు, అది చూసి పిల్లలకు ఉద్రేకం కలగవచ్చు.
అలాంటి అవకాశం కలగకుండా ఉండటానికి ఈ ఏర్పాటు అవసరం అయ్యింది ఇది సహజమే. అది పల్లెటూర్లో అయినా పట్టణంలో అయినా ఎక్కడైనా ఒకటే.