భార్య అక్రమ సంబంధం…. క్రమబద్ధమైన జీవితానికి పెద్దల సమక్షంలో మూడుముళ్ల వేయించుకొని పిల్లల్ని కన్నాక ఆ జీవితం కొంచెం మార్పు చేర్పులు జరిగినప్పుడు అక్రమ మార్గంలో వెళ్ళినంత మాత్రాన వచ్చే నష్టం లేదు కొంచెం ధైర్యంగా ఉండండి…అత్త మామ సహాయాన్ని తీసుకోండి…తల్లిదండ్రితో విషయం చెప్పండి…. మన భారతీయ సాంప్రదాయం ఆడవాళ్లకు పుట్టుకతోనే బాధ్యత అనే అంశాన్ని చేర్చి అక్కడ పిల్ల ఆడపిల్ల అనేసి అక్కడ బరువు బాధ్యతలు మోయాలి కాబట్టి మన యొక్క మనస్తత్వాన్ని చిన్నప్పటినుంచి చాలా పట్టిష్టంగా తయారు చేసి ఉంటారు…. ఇప్పుడు పిల్లల బాధ్యత తీసుకోవాల్సిన అవకాశము అవసరము ఉంది కాబట్టే….
అక్రమ సంబంధాలు బాధ్యతలు పంచుకోవు అలా అని బంధాన్ని సపోర్టు చేయరు అలాంటప్పుడు దూరంగా ఉండటం ఉత్తమం… ఒక మనిషి సగటున శరీరాల కలయిక కోసం పుట్టే కామం భర్త దగ్గర అనుభవించే ఉంటారు కాబట్టి…. మీకు ఇప్పటికే అతని మీద అసహ్య భావం కలిగింది కాబట్టి…… ఒక మనిషి సగటు జీవితంలో అది కేవలం ఒక అవసరం…ఇప్పుడు మనిషి అనుభవించాల్సిన సంతోషాలు సరళీకృతమైన జీవిత విధానము ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి… వీలుంటే కష్టసుఖాలను చెప్పుకోవటానికి మంచి స్నేహితుడు లేదా స్నేహితురాలని ఒకరు లేదా ఇద్దరినీ నమ్మండి….. అప్పటికే మీ సమస్య కొలిక్కి రాకపోతే మంచి పుస్తకాలను ఒంటరిగా జీవితా న్ని ఎదిరించి నిలబడిన ఎంతోమంది ప్రముఖులు మన జీవితాలకి పరిచయం చేయండి…
అప్పటికి సమస్య కొలిక్కి రాకపోతే వివాహ వ్యవస్థకు దూరంగా ఉండి కొన్ని వేల మందికి వృత్తిని కలిపిస్తున్న రతన్ టాటా లాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి…. పడి లేచిన తర్వాత ఏది సమస్య కాకపోవచ్చు మీరు జీవితంలో తగిలిన గాయానికి కాలం ఖచ్చితంగా సమాధానం ఇస్తుంది… భర్త మృగంగా ప్రవర్తించాడని మనం జంతువు లాగా ప్రవర్తించకూడదు… సంస్కారం మరిచి భర్త చేసిన తప్పు భార్య చేస్తే సమాజం బరితెగించింది అనే ముద్ర వేయించుకొని జీవితాంతం బాధపడే కన్నా …. మనం తప్పు చేయలేదు అని ఆత్మబలం ఇచ్చే విశ్వాసం ఎలాంటి కష్ట పరిస్థితులైన తట్టుకునే శక్తిని ఇస్తుంది….
విచ్చలవిడి సంసారం ఎయిడ్స్ అనే ప్యాకేజి తీసుకొస్తుంది…. అనే జాగ్రత్తతో బతుకుదాం…. కనీసం మనిషిగా దీర్ఘమైన వ్యాధులు రాకుండా సంతోషంగా ఉంటాము….. ఏ దారి ఎంచుకున్న వారికి ఆ దారిలో సంతృప్తి అనేది చాలా ముఖ్యం…… తప్పు చేసే ప్రతి మగవాడు బానిసలాగా ఆ ఆడదాని కాళ్ళ దగ్గర ఉంటాడు, మనసులో ప్రత్యేకమైన స్థానం అంటూ ఏమీ ఉండదు………… …. ఓ స్త్రీ నీ జీవితం ఎన్ని రంగులు అలుముకున్న స్వీకరించి సరిదిద్దుకునే శక్తి నీకు మాత్రమే ఉంది ఇది నమ్మకం……. ….. కన్యాశులకం నుంచి నేటి పరిస్థితుల వరకు అన్నీ నీ చుట్టూ వచ్చిన సంబంధ బాంధవ్యాలలో మార్పు తప్పించి……. నీ రూపు రేఖలను పెద్దగా ప్రభావితం చేయలేదు అని గమనించి నడుచుకో……