lifestyle

ఈ విష‌యాల్లో పురుషుల క‌న్నా స్త్రీలే మేటి.. అవేంటో తెలుసా..?

మనిషనే ప్రతి ఒక్కరికీ వీక్ నెస్ లు ఉంటాయి..కానీ అబ్బాయిలకు సంభందించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే అవునా అనుకోకుండా ఉండలేం … ఉరుములు ,మెరుపులు వచ్చేప్పుడు ఆడవారికన్నా మగవారు ఐదురెట్లు ఎక్కువ భయపడ్తారు తెలుసా..ఇది వినడానికి ఫన్నీ గా ఉన్న ఒక అధ్యయనంలో తేలిన విషయం..ఇదే కాదు మగవాళ్లకు సంబందించిన మరికొన్ని విషయాలు చదవండి. 70% మంది అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట..

ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ చెప్తారు..తాము వలచిన స్త్రీ చేయ్ జారిపోకుడదంటే తప్పదు మరి… మగవారి మెదడు ఏకకాలంలో కుడి ,ఎడమలలో ఒకవైపే పనిచేస్తుంది.అందుకే వాళ్లు ఒకేసారి రెండు పనులు చేయలేరు.,..ఆడవాళ్లు మల్టీ టాస్కింగ్ చేయడానికి కారణం వారి మెదడు ఏకకాలంలో రెండువైపులా పనిచేయడమే… ఆడవాళ్లల్లో కంటే మగవాళ్లలో రెండు రెట్లు ఎక్కువ చెమట పడ్తుంది..

women are superior to men in these topics

భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ తో నడిచేప్పుడు తమ నడకస్థాయిని ఏడు శాతం తగ్గించి నడుస్తారు మగవారు.. మగవాళ్ల జీవితకాలంలో ఆరునెలల కాలాన్ని షేవింగ్ కి ఖర్చు చేస్తారట.. ఆడవాళ్లు రోజుకు మూడు అబద్దాలు చెప్తే ,మగవాళ్లు చెప్పే అబద్దాల సంఖ్య దానికి రెట్టింపు.. గుండుతో ఉండే మగవాళ్లు ఒక అంగుళం ఎక్కువ పొడవున్నట్టు కనిపిస్తారు,అంతేకాదు వీళ్లు జుట్టు ఉన్నవారికంటే 13% శక్తిమంతులట.. చాలాసార్లు ఆడవాళ్లు ఏదైనా మాట్లుడుతుంటే మగవాళ్లు అక్కడినుండి వెళ్లిపోతుంటారు..దీనికి కారణం ఆడవాళ్ల మాటలు పలు రకాల ఫ్రీక్వెన్సీలతో రావడం వలన వాటిని అర్దం చేసుకునే శక్తి మగవారికి ఉండదట.

Admin

Recent Posts