శృంగారమనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఓ ముఖ్యమైన భాగం. ఈ క్రమంలో కొంత మందికి ఎల్లప్పుడూ అదే యావ ఉంటుంది. మరికొందరు ఆ యావ ఉన్నా అంత త్వరగా బయట పడరు. చాలా కొద్ది మందికి అసలు ఆ యావ అనేది ఒకటి ఉండదు. అయితే శృంగారం విషయంలో ఎవరు ఎలా ఉన్నా కొంత మంది ఒక్కోసారి తమ హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. చుట్టూ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా చూసేందుకు అవకాశం ఉందా అన్నది ఆలోచించకుండానే ఆ పనిలో బిజీగా ఉంటారు. అయితే అన్ని రోజులు మనవి కావు అన్నట్టుగా, ఎక్కడ పడితే అక్కడ శృంగారంలో పాల్గొనేవారు ఏదో ఒక రోజు ఎవరి కంట్లోనో పడక తప్పదు. ఇబ్బందులు కొని తెచ్చుకోక తప్పదు. ఈ నేపథ్యంలో అలా హద్దు మీరి ప్రవర్తించే వారు ఎవరైనా కొన్ని ప్రదేశాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందేనట. ఆ ప్రదేశాల్లో ఉన్నప్పుడు అసలు సెక్స్‌లో పాల్గొనకపోవడమే మంచిదట. లేదంటే అనుకోని సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందట.
ఏ నివాసంలోనైనా వాటిలో ఉండే కిటికీల దగ్గర మాత్రం సెక్స్‌లో పాల్గొనకూడదు. ఎందుకంటే ఆ ప్రదేశంలో శృంగారం చేస్తుంటే చుట్టు పక్కల వారికి ఆ కార్యక్రమం స్పష్టంగా కనిపిస్తుందట. దీంతో వారు ఆ దృశ్యాలను చిత్రీకరించి నెట్‌లోకి అప్‌లోడ్ చేస్తే ఇక అంతే సంగతులు. ఆ తరువాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. శృంగారంలో పాల్గొనేందుకు కొంత మంది తమ తమ ఆఫీస్‌లను కూడా మంచి ప్రదేశాలుగా ఎంచుకుంటుంటారు. అయితే ఆఫీస్‌లు కూడా ప్రమాదాలను తెచ్చి పెడతాయి. ఎందుకంటే నేటి తరుణంలో ఏ ఆఫీస్‌లో చూసినా సీసీ కెమెరాల వాడకం ఎక్కువైంది. దీంతో ఆ కెమెరాలకు అలా చిక్కితే ఇంక అంతే. వారెవరైనా కష్టకాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయ పరంగా ఇబ్బందులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
బీచ్‌లో శృంగారంలో పాల్గొనాలంటే అధిక శాతం మంది ఆసక్తి చూపుతారు. కానీ ఆ ప్రదేశంలో అలా చేయడం అనేక దేశాల్లో శిక్షార్హమైన నేరమట. కాబట్టి బీచ్ శృంగారం చేయకూడదు. దీనికి తోడు అక్కడి ఇసుక వల్ల చర్మ సంబంధ రోగాలు వస్తాయట. కొంత మంది కారులో కూడా శృంగారం చేస్తారు. అయితే అక్కడ కూడా అలా చేయకూడదట. ఎందుకంటే అలా చేసే సమయంలో పోలీసులకు చిక్కితే వారి నుంచి ఇబ్బందులు తప్పవు. అంతే కాదు భారీ మొత్తంలో జరిమానా కూడా పడుతుందట. ఖాళీగా ఉంది కదా అని సినిమా థియేటర్‌లో శృంగారం చేస్తే అది ఎలాంటి సమస్యలనైనా తెచ్చి పెడుతుంది. థియేటర్ యాజమాన్యానికి తెలిస్తే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం, వేధింపులకు గురి చేయడం వంటివి చేస్తారు. అలా కూడా ఇబ్బందులు తప్పవు.
అడవిలో ఎక్కడ పడితే అక్కడ ఏ పొదలోనైనా, గడ్డి, మొక్కల వద్దయినా శృంగారం చేస్తే అనుకోని ప్రమాదాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఏవైనా విష పూరితమైన మొక్కల బారిన పడితే అది ప్రాణాల మీదకు తెస్తుంది. మనుషులెవరూ లేరు కదా అని బహిరంగ ప్రదేశాల్లోనూ సెక్స్‌లో పాల్గొనకూడదు. దీంతో కూడా ఇబ్బందులు తప్పవు. పోలీసులు చూస్తే ఆ కథ వేరేలా ఉంటుంది. ఆకతాయిలు ఆ దృశ్యాలను చూస్తే మరోలా ఉంటుంది. చాలా తక్కువ స్పేస్‌తో దాదాపు ఎవరూ ఉండని ప్రదేశం లిఫ్ట్. అందులో సెక్స్ చేయడం కొంత మందికి థ్రిల్‌గా ఉంటుంది. కానీ అక్కడ కూడా ఈ మధ్య సీసీ కెమెరాలు పెడుతున్నారు. కాబట్టి ఆ ప్రదేశంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. ప్రతిదానికి ఓ పద్దతంటూ ఏడ్చింది కాబట్టి ఆ పద్దతి ప్రకారం కానిస్తే….అంతా శుభమే అలాకాకుండా కకృత్తి కామరాజ్ లాగా బీహేవ్ చేస్తే….బతుకులు బట్టల్లేకుండా బజారునొచ్చి పడతాయ్..తస్మాత్ జాగ్రత్త.