Bald Head Reasons : పురుషుల‌కు అస‌లు బ‌ట్ట‌త‌ల ఎందుకు వ‌స్తుంది.. దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి..?

Bald Head Reasons : పురుషుల‌ను వేధించే వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌ల్లో బ‌ట్ట‌త‌ల స‌మ‌స్య కూడా ఒక‌టి. బ‌ట్ట‌త‌ల‌తో బాధ‌ప‌డే పురుషుల‌ను మ‌నం చాలా మందినే చూసి ఉంటాము. పూర్వ‌కాలంలో వ‌య‌సు పైబ‌డిన వారిలోనే క‌నిపించే ఈ స‌మ‌స్య నేటి త‌రుణంలో యుక్త‌వ‌య‌సులో ఉన్న వారిలో కూడా క‌నిపిస్తుంది. బ‌ట్ట‌త‌ల కార‌ణంగా చాలా మంది పురుషులు ఆత్మనూన్య‌త భావ‌న‌కు గురి అవుతారు. చిన్న వ‌య‌సులోనే బ‌ట్ట‌త‌ల రావ‌డం వ‌ల్ల పెద్ద‌వారిలాగా క‌నిపిస్తారు. బ‌య‌ట తిర‌గడానికి కూడా ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. తీవ్ర‌మైన నిరాశ‌కు కూడా గురి అవుతూ ఉంటారు. బ‌ట్ట‌త‌ల రావ‌డానికి జ‌న్యుప‌ర‌మైన కార‌ణాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పురుషుల్లో ఉండే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల చేత డీహైడ్రో టెస్టోస్టిరాన్ గా మారిపోతూ ఉంటుంది. దీంతో వెంట్రుక‌ల ఎక్కువ‌గా రాలిపోయి బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది.

వంశ‌పార‌ప‌ర్యంగా కూడా బ‌ట్ట‌త‌ల వ‌స్తూ ఉంటుంది. అయితే ఇవే కాకుండా పురుషుల్లో బ‌ట్ట‌త‌ల రావ‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ కార‌ణాల చేత కూడా పురుషుల్లో బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. పురుషుల్లో బ‌ట్ట‌త‌ల రావ‌డానికి గ‌ల ఇత‌ర కార‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వాడే మందుల కారణంగా కూడా పురుషుల్లో బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. క్యాన్స‌ర్, అధిక ర‌క్త‌పోటు, డిప్రెష‌న్, ఆర్థ‌రైటిస్ వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వాడే మందుల ప్ర‌భావం కార‌ణంగా కూడా బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. అదే విధంగా హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోవ‌డం వంటి కార‌ణాల చేత కూడా బ‌ట్ట‌త‌ల వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక పురుషుల్లో వ‌య‌సు పైబ‌డ‌డం వల్ల కూడా బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. వ‌య‌సు పైబ‌డడం వ‌ల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలు త‌గ్గుతాయి. దీంతో జుట్టు ఎక్కువ‌గా రాలిపోతూ ఉంటుంది.

Bald Head Reasons why men get it
Bald Head Reasons

అయితే ఈ స‌మ‌యంలో స‌రైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్ల బ‌ట్ట‌త‌ల రాకుండా చూసుకోవ‌చ్చు. కొన్నిసార్లు పోషకాహార లోపం వ‌ల్ల కూడా బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. జుట్టు పెరుగుద‌ల‌కు అనేక పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. క‌నుక మ‌నం సంపూర్ణ ఆహారాన్ని తీసుకోవ‌డానికి వీలైనంత ఎక్కువ‌గా ప్ర‌య‌త్నించాలి. ఇక దీర్ఘ‌కాలిక ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా బ‌ట్ట‌త‌ల ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. అలాగే చాలా మంది జుట్టు అందంగా, స్టైల్ గా క‌న‌బ‌డ‌డానికి అనేక ర‌కాల హెయిర్ స్టైలింగ్స్ ను ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. అనేక ర‌కాల క్రీమ్ ల‌ను, ర‌సాయ‌నాలు క‌లిగిన క‌ల‌ర్స్ ను, షాంపుల‌ను వాడుతూ ఉంటారు. దీని వ‌ల్ల కూడా జుట్టు ఎక్కువ‌గా రాలిపోయి బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. అలాగే ధూమ‌పానం వ‌ల్ల కూడా పురుషుల్లో బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. ఈ విధంగా అనేక కార‌ణాల చేత పురుషుల్లో బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది. అయితే స‌రైన జాగ్ర‌త్తలు, స‌రైన ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts