పొరపాటున కూడా మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోరాదు.. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..!

మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను కిడ్నీలు ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతుంటాయి. అందువల్ల మూత్రం వస్తే వెంటనే విసర్జించాలి. కానీ ఎక్కువ సేపు ఆపుకోరాదు. మూత్రం ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పొరపాటున కూడా మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోరాదు.. అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..!

1. మూత్రం వ‌చ్చినా విస‌ర్జించకుండా ఎక్కువ సేపు అలాగే ఆపుకుంటే మూత్రాశయంలో బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వ‌ల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

2. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవ‌డం వ‌ల్ల మూత్రాశ‌య ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి.

3. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే కిడ్నీల్లో రాళ్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక మూత్రం వ‌స్తుంటే ఆపుకోరాదు. వెంట‌నే పోసేయాలి.

4. క‌నీసం 2 గంట‌ల‌కు ఒక‌సారి అయినా మూత్ర విస‌ర్జ‌న చేస్తే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. మూత్రం ఆపుకునే కొద్దీ నిమిష నిమిషానికి మూత్రాశ‌యంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మూత్రం మ‌ళ్లీ కిడ్నీల్లోకి చేరుతుంది. అక్క‌డ మ‌ళ్లీ ఫిల్ట‌ర్ అయి మూత్రం మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌స్తుంది. దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయి.

5. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవ‌డం వ‌ల్ల మూత్రాశ‌యంపై ఒత్తిడి ప‌డి మూత్రాశ‌యం కండ‌రాలు బ‌ల‌హీనంగా మారుతాయి. దీంతో మూత్రం స‌రిగ్గా రాదు.

6. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవ‌డం వ‌ల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అందువ‌ల్ల మూత్రాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు విస‌ర్జించాల్సి ఉంటుంది. ఎక్కువ సేపు ఆపుకోరాదు.

Share
Admin

Recent Posts