వైద్య విజ్ఞానం

శ‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ?

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఎల్‌డీఎల్ మ‌న శ‌రీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువ‌గా ఉండ‌డం హానిక‌రం. ఎల్‌డీఎల్‌ను త‌గ్గించేందుకు హెచ్‌డీఎల్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

how much time it will take to reduce cholesterol levels in body

ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. హైబీపీ వ‌స్తుంది. డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి.

కొలెస్ట్రాల్ అనేది ఒక ఫ్యాట్ లాంటి ప‌దార్థం. దీన్ని మ‌న శ‌రీరంలో లివ‌ర్ ఉత్ప‌త్తి చేస్తుంది. దీంతో ప‌లు విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అయితే ఎల్‌డీఎల్ అంటే.. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ర‌క్త నాళాల్లో అది పేరుకుపోయి గుండె పోటు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అందువ‌ల్ల దాన్ని త‌గ్గించుకోవాలి.

మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్ 100 mg/dL క‌న్నా త‌క్కువ‌గా ఉండాలి. 130 నుంచి 159 mg/dL మ‌ధ్య ఎల్‌డీఎల్ ఉంటే దాన్ని బార్డ‌ర్ లైన్ అంటారు. అదే 160 mg/dL క‌న్నా ఎక్కువ‌గా ఎల్‌డీఎల్ ఉంటే అది హానిక‌రంగా చెబుతారు.

అయితే ఎల్‌డీఎల్ స్థాయిల‌ను బ‌ట్టి అది త‌గ్గేందుకు ప‌ట్టే స‌మ‌యం మారుతుంది. ఎల్‌డీఎల్ కొందరిలో 600 mg/dL వ‌ర‌కు ఉంటుంది. అలాంటి వారు డాక్ట‌ర్ సూచించిన‌ట్లుగా మందుల‌ను వాడితే నెల రోజుల్లోగా కొలెస్ట్రాల్ అదుపులోకి వ‌స్తుంది. లేదంటే 3 నుంచి 6 నెల‌ల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. అయితే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకునేందుకు వ్యాయామం చేయ‌డంతోపాటు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి.

ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌తోపాటు కూర‌గాయ‌లు, పండ్లు, న‌ట్స్, చేప‌ల‌ను అధికంగా తీసుకోవాలి. దీంతో ఎల్‌డీఎల్ త‌గ్గుతుంది. అలాగే రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా స‌రే వ్యాయామం చేయాలి. ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, కొవ్వు ప‌దార్థాలు, జంక్ ఫుడ్‌, వేపుళ్లు, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాల‌ను మానేయాలి. అలాగే మొల‌కెత్తిన పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ గ‌ణ‌నీయంగా త‌గ్గుతాయి. ఇక కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌వారు మ‌ద్యం, పొగ తాగ‌డం మానేయాలి. లేదంటే హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి.

Share
Admin

Recent Posts