కఠినమైన నియమాలతో డైటింగ్ చేయటం మంచిదే. అయితే, కొవ్వు తగ్గించుకోవాలనే తాపత్రయంలో మీ చర్మం తన మెరుపు కోల్పోతుంది. మరి ఆ మెరుపు మరోమారు మెరవాలంటే ఏం చేయాలో చూడండి. అందం, లోపలినుండి వస్తుంది. ముఖం సహజ మెరుపు కాస్మెటిక్స్ లో లేదంటారు చర్మ నిపుణులు.శరీరంలోని ఇతర అవయవాలవలెనే చర్మంకూడా మీ డైట్, జీవన విధానాలపై ఆధారపడివుంటుంది.
మీ శరీరాన్ని లోపలినుండి పోషిస్తే, మీ చర్మం సంరక్షణ, వయసు పైబడకుండా కనపడటమనేవి మీ చేతుల్లో వున్నాయి. డైటింగ్ చేసేవారు సాధారణంగా అత్యవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ నిలిపేస్తారు. ఇవి శరీరానికి ఎంతో అవసరం. చర్మానికే కాదు, గుండె సంబంధిత, రోగ నిరోధకత, సంతానోత్పత్తి, నరాల వ్యవస్ధ అన్నిటిపై ఇవి ప్రభావం చూపుతాయి. శరీరంలో కొత్త కణాలు పుట్టేలా చేస్తాయి.
డ్యామేజీ అయిన కణాలు తిరిగి జీవంపోసుకునేలా చేస్తాయి. మలినాలను తొలగిస్తాయి. ఇటీవల చేసిన పరిశోధనలు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు పొడి చర్మానికి మందుగానే కాదు బరువు తగ్గించేందుకు కూడా తోడ్పడతాయని తెలుపుతున్నాయి. కనుక మీరు తినే ఆహారంలో బరువు తగ్గాలంటూ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ లను తొలగించకండి. ఇవి వుండే ఆహారాలు తప్పక తీసుకోండి అంటున్నారు చర్మ సంరక్షక నిపుణులు.