స్వీడన్ లో చేసిన హెల్త్ కేర్ రీసెర్చి లో హృదయ ధమని వ్యాధి అంటే కరోనరీ హార్ట్ డిసీజ్ అనేది జీన్స్ ద్వారా సంక్రమించే వ్యాధని అనారోగ్య జీవన విధానాలు ఆచరించటం వలన వచ్చేదికాదని తేలింది. రీసెర్చర్లు ప్రొఫెసర్ క్రిస్టినా ఈ వ్యాధి వున్న రోగుల తల్లి తండ్రులను పరిశీలించారు. 40 నుండి 60 శాతం మందికి తల్లి తండ్రులలో ఎవరికి వున్నప్పటికి ఈ వ్యాధి సంతాననికి జీన్స్ ద్వారా సంక్రమిస్తోందని వెల్లడించారు.
అయితే అంత మాత్రం చేతే అనారోగ్య జీవన విధానం కారణం కాదంటానికి వీలు లేదన్నారు. ఒక వేళ తల్లి తండ్రులకు లేకపోయినప్పటికి అనారోగ్య జీవన విధానాల కారణంగా కూడా వ్యక్తికి వచ్చే అవకాశం వుందని తెలిపారు.
ఏది ఏమైనప్పటికి నేటి రోజులలో అనారోగ్య జీవన విధానాలే అధికంగా గుండె జబ్బులకు కారణమవుతున్నాయని, ప్రజలు ఆరోగ్యకర జీవన విధానం అవలంబిస్తే గుండె సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చని ఆమె తెలిపారు. ఈ పరిశోధనా అంశాలను అమెరికన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించారు.