రాత్రి పూట నిద్రలోకి జారుకున్న అనంతరం చాలా మంది అయితే నిద్ర లేవరు. కానీ వయస్సు మీద పడే కొద్దీ నిద్ర తగ్గుతుంది. దీంతో రాత్రి పూట తరచూ నిద్ర లేస్తుంటారు. ఇది సహజమే. కానీ వృద్ధులు కాకుండా ఇతర వయస్సుల వారు రాత్రి పూట నిద్ర లేస్తుంటే.. అది కూడా తరచూ ఇలా జరుగుతుంటే కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట 3 నుంచి 4 గంటల మధ్య నిద్ర లేవడం అన్నది ఒక్కోసారి సహజంగానే జరిగే ప్రక్రియ. కానీ ఇలా తరచూ జరుగుతుంటే మాత్రం అనుమానించాల్సిందేనని అంటున్నారు. ఇలా తరచూ రాత్రి పూట 3 నుంచి 4 గంటల మధ్య నిద్ర లేస్తుంటే శరీరం తీవ్రమైన వ్యాధుల బారిన పడిందని అర్థం చేసుకోవాలని వారు అంటున్నారు.
రాత్రి పూట 3 నుంచి 4 గంటల మధ్య నిద్ర లేచినప్పుడు మీ గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది అంటే మీకు గుండె పోటు వచ్చే చాన్స్ ఉందని భావించాలని వైద్యులు అంటున్నారు. ఆ సమయంలో శరీరంలో రక్త సరఫరాకు ఏదైనా ఆటంకం ఏర్పడినా, ఇతర ఏవైనా గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నా అలా ఆ సమయంలో మెళకువ వస్తుందట. కనుక ఆ సమయంలో మీరు గనక నిద్ర లేస్తే.. అప్పుడు మీ హార్ట్ బీట్ అధికంగా ఉంటే.. దాన్ని గుండె సమస్యగా అనుమానించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి.
ఇక ఈ సమయంలో మెళకువ వస్తుంది అంటే షుగర్ సమస్య ఉందని అర్థం చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఈ సమయంలో మెళకువ వస్తుందట. అలాగే లివర్ వ్యాధులు ఉన్నా, లివర్ పనితీరు మందగించినా కూడా ఇలా జరుగుతుందట. దీంతోపాటు మానసిక సమస్యలు ఉన్నవారిలోనూ ఇలా జరుగుతుందట. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ అధికంగా ఉంటే ఇలా రాత్రి పూట 3 నుంచి 4 గంటల మధ్య మెళకువ వస్తుందట. కనుక ఎవరికైనా తరచూ ఇలా జరుగుతుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అసలు మెళకువ ఎందుకు వస్తుందో కనిపెట్టే ప్రయత్నం చేయండి. దీంతో ప్రాణాల మీదకు రాకుండా చూసుకోవచ్చు.