వైద్య విజ్ఞానం

వయాగ్రాను వీరు అసలు తీసుకోవద్ద‌ట‌.. ఎందుకో తెలుసా..?

శృంగారం లో తమ కోరికలను తీర్చుకోవడానికి చాలా మంది వయాగ్రా వాడతారు. ఆ సమయంలో వయాగ్రా ఉపయోగిస్తే ఇంకా ఉత్సాహంగా శృంగారం జరపవచ్చు అనేది చాలా మందిలో ఉన్న నమ్మకం. అయితే వయాగ్రా వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాద‌ని వైద్యులు అంటున్నారు. వయాగ్రా వాడటం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శృంగారంలో రెచ్చిపోవాలని, అంగస్తంభన త్వరగా జరగకుండా ఉండేందుకు వయాగ్రా వాడుతుంటారు. వీటి ప్రభావం ఎక్కువ సేపు ఉండటం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వయాగ్రాని అంగస్తంభన సమస్యలు ఉన్నవారు మాత్రమే వాడాలని, ఎవరు పడితే వారు వయాగ్రా వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, శృంగారం చేసేందుకు ఆరోగ్యం సహకరించని వాళ్లు ఈ వయాగ్రా వాడకూడదని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా వయాగ్రాను వారు ఉపయోగించినట్లైతే గుండె జబ్బులకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వయాగ్రా ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. రోజుకి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి, అది కూడా 50ఎంజీకి మించరాదని వైద్యులు సూచిస్తున్నారు.

these people should not take viagra know why

శృంగారం జరపడానికి ఒక గంట ముందుగా వేసుకోవాలి. అప్పుడే దాని ప్రభావం బాగుంటుందని చెబుతున్నారు. వయాగ్రా పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి, రక్తం స్వేచ్ఛగా ప్రసరించేలా చేస్తుంది. వయాగ్రా ను గ్రేప్ జ్యూస్ లో మాత్రం కలిపి తీసుకోకూడదు. అలా చేస్తే దాని పనితీరు తగ్గిపోతుంది. శృంగారం తర్వాత కూడా కొందరిలో వయాగ్రా ప్రభావం మాత్రం తగ్గడంలేదు. అలాంటప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అటువంటి సమస్య ఉన్నవారు నిర్లక్షం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Admin

Recent Posts