వైద్య విజ్ఞానం

హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు క‌నిపించే సంకేతాలు, ల‌క్ష‌ణాలు ఇవే.. వీటిని తెలుసుకుంటే హార్ట్ ఎటాక్‌ను ముందుగానే నిరోధించ‌వ‌చ్చు..!

హార్ట్ ఎటాక్ అనేది ఒక సైలెంట్ కిల్ల‌ర్ లాంటిది. అది ఎప్పుడు వ‌స్తుందో, ఎలా వ‌స్తుందో తెలియ‌దు. స‌డెన్‌గా హార్ట్ ఎటాక్ వ‌చ్చి కుప్ప కూలిపోతుంటారు. దీంతో ప్రాణాపాయ స్థితి సంభ‌విస్తుంది. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని తెలుసుకోవ‌డం ద్వారా హార్ట్ ఎటాక్ ను ముందే గుర్తించ‌వ‌చ్చు. దీంతో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

1. హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు ఛాతిలో అసౌక‌ర్యంగా ఉంటుంది. గుండెల మీద బ‌రువు పెట్టిన‌ట్లు అనిపిస్తుంది. గ్యాస్ వ‌ల్ల వ‌చ్చే నొప్పి అయితే అప్ప‌టికప్పుడు త‌గ్గుతుంది. కానీ హార్ట్ ఎటాక్ నొప్పి అయితే వెంట‌నే త‌గ్గ‌దు. ఛాతి మీద బ‌రువుగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. ఈ విధంగా తేడాను గుర్తించ‌వ‌చ్చు.

2. హార్ట్ ఎటాక్ అనేది ర‌క్త నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డ‌డం వ‌ల్ల వ‌స్తుంది. అయితే ఈ విధంగా జ‌రిగిన‌ప్పుడు చేతులు, వెన్నెముక‌, మెడ‌, ద‌వ‌డ‌లు, జీర్ణాశ‌యం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ఆయా భాగాల్లో నొప్పిగా ఉంటే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే హాస్పిట‌ల్‌లో చేరి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

these symptoms can appear before heart attack know them

3. నిద్ర నుంచి లేవ‌గానే కొంద‌రికి చెమ‌ట‌లు ప‌డుతుంటాయి. అలాగే కొంద‌రికి వికారంగా, వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. ఇవి హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలే. ఇవి గ‌న‌క క‌నిపిస్తుంటే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి. అలాగే కొంద‌రికి ఈ ల‌క్ష‌ణాల‌తోపాటు ద‌గ్గు, జ‌లుబు కూడా నిరంత‌రాయంగా వ‌స్తుంటాయి. క‌నుక ఈ ల‌క్ష‌ణాలను కూడా గ‌మ‌నించాలి.

4. హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు క‌నిపించే ల‌క్ష‌ణాల్లో ఒక‌టి.. శ్వాస స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం. రోజువారీగా చేసే ప‌నులు య‌థావిధిగా చేస్తున్నా అల‌స‌ట‌గా అనిపించ‌డం, మెట్లు ఎక్క‌డం, కొంత దూరం న‌డిచినా ఆయాసం రావ‌డం.. వంటివి హార్ఠ్ ఎటాక్ వ‌చ్చే ముందు క‌నిపించే సంకేతాలే. ఇవి క‌నిపిస్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకుని అవ‌స‌రం అయితే చికిత్స తీసుకోవ‌డం మంచిది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

Admin

Recent Posts