గుండె వేగంగా కొట్టుకోవడమనేది మీ గుండె చప్పుడు సాధారణంగా లేదని తెలుపుతుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరికి ఒక్కో విధంగా వుండి అసౌకర్యాన్ని తెలియజేస్తుంది. ఈ మార్పు మీకు ఛాతీ, గొంతు, లేదా మెడ లో కూడా రావచ్చు. మీ గుండె పరుగెడుతున్నట్లు మీకనిపిస్తూంటుంది. లేదా మీ గుండె కొన్ని సార్లు కొట్టుకోవడం లేదన్నట్లుగాను, సమస్య కలిగి ఆగిపోతున్నట్లుగాను కూడా మీకనిపిస్తుంది.
ఈ స్ధితినే వైద్యులు పాల్పిటేషన్స్ అని కూడా అంటారు. ఇవి సాధారణ గుండె చప్పుడు నుండి లేదా వేగంగా వచ్చే హార్ట్ బీట్ నుండి కూడా కలిగే అవకాశం వుంది. ఇవి ఒక మాదిరి నుండి, తీవ్రంగా కూడా వుండి రోజులో కొన్ని సార్లు మాత్రమే మీరు కొన్ని చర్యలు చేసేటపుడు వస్తాయి. ఇవి ఆకస్మికంగాను లేదా ఎప్పటినుండోను కూడా మీకు వస్తూ వుండవచ్చు. ఈ పాల్పిటేషన్లు హృదయ సంబంధంగా లేదా జీర్ణవ్యవస్ధ సంబంధంగా లేదా మానసికంగా లేదా శ్వాస సంబంధిత కారణాలుగా కూడా వస్తాయి.
ఈ సమయంలో హార్ట్ బీటింగ్ సక్రమంగా లేక అతి వేగంగా వుంటుంది. ఒక్కోకపుడు కేఫేన్ లేదా ఇతర మందులు కూడా ఈ పాల్పిటేషన్స్ కలిగించవచ్చు. ఇవి గుండె పోటుకు సంకేతాలుగా వుండి తక్షణమే వైద్య సహాయం కోరతాయి. ఛాతీ భాగంలో మీకు శ్వాస సరిగా ఆడకున్నా లేక నొప్పి లేక ఒత్తిడి వచ్చినా మీరు గుండెపోటుకు గురవబోతున్నారన్నది తెలుసుకోవాలి. మీ గుండె అతి వేగంగా కొట్టుకోవడం నిరంతరం జరుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.