వైద్య విజ్ఞానం

ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? దానిలో ఉండే దశలు ఏమిటి ? ఈ సమస్యను తగ్గించుకునే మార్గాలు ఏమిటి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడం నాకు అలవాటు&period; 4 సంవత్సరాలకు ముందు చేసిన పుల్ బాడీ చెక్ అప్ లో గ్రేడ్ -1 ఫాటీ లివర్ అని రిపోర్ట్ వచ్చింది&period; అంతకుముందు 24 గంటలు ఆఫీస్ వర్క్ గురించి ఆలోచిస్తూ నా హెల్త్ ను పెద్దగా పట్టించుకోక పోవడం వల్లో లేక పిజ్జాలు ఎక్కువగా తినడం వల్లో లేదా పై రెండు కారణాల వల్ల ఎత్తుకు మించి బరువు ఉండడం వల్లో &comma; లేక రక్తం లో కొలెస్ట్రాల్ కొంచెం అధికంగా ఉండడం వల్ల ఆలా జరిగి ఉండొచ్చు&period;నాకు మద్యపానం &comma; సిగిరెట్ లాంటి దుర్వ్యసనాలు లేవు&period; కొంచెం స్వీట్స్ ఎక్కువ తినేవాడ్ని&period; మా ఆఫీసులో చాలా మందికి కూడా ఇదే ప్రాబ్లెమ్ ఉన్నట్టు విన్నా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తరువాత ఫాటీ లివర్ కి దారితీసే కారణాలు కూడా శోధించాను&period; ఆ కారణాలు&period;&period; అనువంశికం&comma; కామెర్లు&comma; కొన్ని రకాల మందుల à°µ‌ల్ల‌&comma; మద్యపానం&comma; ధూమపానం&comma; అధిక కొలెస్ట్రాల్&comma; అధిక బరువు&comma; మధుమేహం&comma; అధిక BP&comma; వేగంగా బరువు తగ్గడం&comma; హైపోథైరాయిడిజం&period; వైద్య పరిభాషలో ఫాటీ లివర్ ను రెండు ప్రాథమిక రకాలుగా విభజించారు&period; ఆల్కహాలిక్ ఫాటీ లివర్&period; నాన్ అల్కోహాలిక్ ఫాటీ లివర్&period; ఆల్కహాలిక్ ఫాటీ లివర్ మద్యపానం ఎక్కువ గా చేసేవారిలో వస్తుంది&period; నాన్ అల్కోహాలిక్ ఫాటీ లివర్ మద్యపానం కాకుండా మరే ఇతర కారణాల వల్ల రావొచ్చు దీన్ని కనుక్కోవడం చాలా కష్టం&period; అదృష్టం కొద్దీ నేను ప్రతి సంవత్సరం రొటీన్‌గా చేయించే టెస్ట్ వల్ల అది బయట పడింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85943 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;fatty-liver&period;jpg" alt&equals;"what is fatty liver what are the causes and treatment options " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫాటీ లివర్ జబ్బులో మూడు గ్రేడ్స్ ఉంటాయి&period; గ్రేడ్ -1&comma; గ్రేడ్ -2&comma; గ్రేడ్ -3&period; గ్రేడ్ -1 పైన చెప్పిన ఏదో ఒక కారణం వల్ల చాలామందిలో ఉండే ఇప్పడిప్పుడే అంతగా హాని కలిగించని స్టేజ్&period; ఈ స్టేజ్ లో లివర్లో కొంచెం కొవ్వు పెరుగుతుంది&period; లివర్ &lpar;పసుపు రంగులో&rpar; కొవ్వు కణాలు పెరుగుతాయి&period; లివర్లో ఎంత ఎక్కువగా కొవ్వు కణాలు పెరిగితే అంతగా దాని పని తీరు మందగిస్తుంది&period; తరువాత చేసిన పరిశోధనలో గ్రేడ్ -1ఫాటీ లివర్ ని పూర్తిగా నయం చేయొచ్చు అని తెలుసుకొన్నాను&period; నేను తినే తిండి&comma; జీవన శైలి లో మార్పుల వల్ల ఇప్పుడు నా గ్రేడ్ -1 ఫాటీ లివర్ ప్రాబ్లెమ్ పూర్తిగా నయం అయ్యింది&period; దీని కోసమే నేను అన్నం మాని మిల్లెట్స్ తినడం&comma; రోజు 5 నుంచి 7 కిలోమీటర్లు నడవడం&comma; స్వీట్స్&comma; పిజ్జాలు తినడం పూర్తిగా తగ్గించా&period; గ్రేడ్ -2 ఫాటీ లివర్ కూడా పూర్తిగా నయం చెయ్యొచ్చు అని చదివాను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్రేడ్ -3 లోకి చేరితే మాత్రం పూర్తిగా నయం చెయ్యలేం&comma; అది లివర్ సిర్రోసిస్ కి దారితీస్తుంది&comma; కాలేయ మార్పిడి ఒక్కటే మార్గం&comma; 15–30 లక్షలు ఖర్చు అవుతుంది ఈ ఆపరేషన్ కు&comma; అందుకే తొందరగా మేలుకోండి జీవన శైలి లో మార్పులు చేసుకోండి&period; ఆరోగ్యంగా ఉండండి&period; లివర్ ఫంక్షన్ టెస్ట్&comma; ఆల్ట్రాసౌండ్ స్కాన్ లో లివర్ పరిస్థితి తెలుస్తుంది&period; ఆఖరుగా మీ బాగా నమ్మే ఒక మంచి వైద్యుడిని సంప్రదించండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts