రాత్రి పూట సహజంగానే కొందరికి నిద్రలో మెళకువ వస్తుంటుంది. మూత్ర విసర్జన చేసేందుకు, మంచి నీళ్లను తాగేందుకు కొందరు నిద్ర లేస్తుంటారు. ఎక్కువగా వయస్సు అయిపోయిన వారు రాత్రి పూట నిద్ర లేస్తారు. ఇక షుగర్ సమస్య ఉన్నవారికి కూడా రాత్రి పూట మెళకువ వస్తుంటుంది. వారు కూడా మూత్ర విసర్జన కోసం నిద్ర లేస్తారు.
అయితే కొందరికి తెల్లవారుజామున 3 గంటలకు షుగర్ లెవల్స్ పెరుగుతుంటాయి. ఇందుకు డాక్టర్లు రెండు కారణాలను చెబుతున్నారు. అవేమిటంటే..
తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలకు గురయ్యేవారిలో కార్టిసోల్, గ్రోత్ హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతుంటాయి. అవి లివర్‌కు ఎక్కువగా గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేయమని చెబుతుంటాయి. రాత్రి పూట కార్టిసోల్ స్థాయిలు పెరిగినప్పుడు సహజంగానే లివర్ గ్లూకోజ్ ను విడుదల చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఈ విధంగా జరగడాన్ని Dawn Phenomenon అంటారు.
ఇక రాత్రి పూట కొందరికి షుగర్ లెవల్స్ బాగా పడిపోతాయి. దీంతో లివర్ గ్లూకోజ్‌ను అధికంగా విడుదల చేస్తుంది. ఈ క్రమంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అయితే షుగర్ ఉన్నవారిలోనే ఈ విధంగా జరుగుతుంటుంది. దీన్నే Somogyi effect అని అంటారు.
అయితే తెల్ల వారుజామున 3 గంటలకు ఎవరికైనా సరే షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయి అంటే వారిలో పైన తెలిపిన రెండు కారణాలు ఉంటాయి. అందువల్లే అలా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అయితే ఇలా షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు సహజంగానే దాహం అవడం, మూత్ర విసర్జన రావడం జరుగుతుంది. అందుకనే ఆ సమయంలో చాలా మందికి మెళకువ వస్తుంది.
ఆరోగ్యవంతులు అయితే ఇలా షుగర్ లెవల్స్ పెరిగినా వెంటనే తగ్గిపోతాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ షుగర్ ఉన్నవారిలో ఇలా తెల్లవారు జామున షుగర్ లెవల్స్ పెరిగితే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఆ సమయంలో షుగర్ చెకింగ్ మెషిన్‌తో ఒక్కసారి షుగర్ లెవల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయడం మంచిది. దీంతో అందుకు అనుగుణంగా వైద్యలు మందులను అందిస్తారు. తద్వారా షుగర్ లెవల్స్ అధికంగా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.