మహిళలకు త్వరగా హార్ట్ ఎటాక్స్ రావనేది తప్పుడు అభిప్రాయం. పురుషులే అధికంగా వీటికి గురవుతారని మహిళలకు గుండె పోట్లు రావని సాధారణంగా అనుకుంటూంటారు. మహిళలకు అసలు హార్టు వుంటే కదా వారికి వాటి బాధలు వచ్చేందుకు అనే జోక్ కూడా పురుషుల నోటి వెంట వింటూనే వుంటాం. కాని హార్ట ఎటాక్ వచ్చిన తర్వాత పురుషులకంటే కూడా స్త్రీలు రెండు రెట్లు మరణాల పాలవుతున్నారన్నది గణాంకాలు తెలుపుతున్నాయి. గుండె పోటు అనేది వస్తే పురుషులలో కంటే కూడా స్త్రీలలో మరణం తధ్యం అని తెలుస్తోంది. మహిళలకు సంబంధించిన గుండె సంబంధిత వ్యాధుల వాస్తవాలు కొన్ని మీ ముందుంచుతున్నాం పరిశీలించండి.
పురుషుల విషయంలో…రక్తనాళాలలోని కొవ్వు పేరుకొని గడ్డలు కట్టి ఎప్పటికపుడు బ్లాక్ అవటాన్ని తెలియజేస్తూంటుంది. కాని మహిళల విషయంలో ఈ కొవ్వులు రక్తనాళాలలో సమాంతరంగా వ్యాపిస్తూనే వుంటాయి. కనుక పురుషుల రక్తనాళాలు వారి 30 సంవత్సరాల వయస్సులోనే కొవ్వు పేరుకున్నట్లు తెలియజేస్తాయి. కాని మహిళలకు కొవ్వు పేరుకోడం తెలుసుకోడం కష్టమే. మహిళలకు గుండె పోటు త్వరగా రాదు. ఎందుకంటే రక్తనాళం పూర్తిగా బ్లాక్ అవ్వాలంటే చాలా కాలం పడుతుంది. కొవ్వు రక్తనాళాలలో గడ్డకట్టటం పురుషులకు 30 సంవత్సరాలకే వస్తే, స్త్రీలకు ఈ దశ రావటానికి మరో పది సంవత్సరాలు పట్టి 40 లలో మొదటి గుండెపోటు వస్తుంది. కనుక చాలా సంవత్సరాలవరకు మహిళలకు గుండె జబ్బు వస్తుందనేదే తెలియకుండా వుంటుంది.
అయితే ఏదో ఒక రోజున అకస్మాత్తుగా రక్తనాళాలు ఒకేసారి మూసుకుపోయి గుండెజబ్బు రావటం వారు మరణించటం జరుగుతుంది. చాలా వరకు గుండెజబ్బులకు గల లక్షణాలు మహిళలలో కనపడవు. ఛాతీ నొప్పి, కింద పడటం మొదలైనవి వీరిలో త్వరగా కనపడవు. అయితే మహిళలకు వికారం కలగటం, వెన్ను నొప్పి రావటం జరుగుతుంది. వారంతట వారు గుండె పోటును పసిగట్టలేరు. హార్ట్ ఎటాక్ అనేది మహిళలలో కూడా చెప్పకుండా రాదు అయితే, దాని లక్షణాలను మహిళలు లెక్కపెట్టరు. అసహజమైన అలసట, బలహీనం, నడిచే శక్తి లేకపోవుట, శ్వాస తగ్గుట, ఆందోళన, నిద్రలేమి మొదలైనవి వీరిలో గుండెపోటు వస్తోందనటానికి సంకేతాలు. మహిళలకు మెనోపాజ్ దశలో గుండెపోట్లు వస్తాయి. కనుక 50 సంవత్సరాల పైన వీరికి ఈ సమస్య వుంటుంది. ఈ సమయంలో ఈస్ట్రోజన్ స్ధాయి తగ్గుతుంది. బ్రెస్ట్ కేనన్సర్, యుటిరస్ కేన్సర్, ఆస్టియోపోరోసిస్ వంటివి కూడా మహిళలకు ఇదే సమయంలో రావటంతో, వీటిపై అధికంగా శ్రద్ధ పెడతారే తప్ప గుండె పోటు గురించి ఆలోచించరు.
మహిళలు పురుషులకంటే మానసికంగా బలవంతులు కనుక వీరికి ఎమర్జెన్సీ మెడికల్ సహాయమనేది పెద్దగా అవసరపడదు. ఈ కారణాలచే గుండె జబ్బులు ఆడవారికి త్వరగా రావనే భావన మనందరకు బలంగా వుంటుంది. అది ఎంత బలంగా వుందంటే, అవసరమైనపుడు కూడా వైద్యసహాయం అవసరమైనపుడు కూడా దానిని అశ్రద్ధ పరచేటంతగా మనం మహిళలకు గుండెజబ్బుల సమస్యలుండవనే భావిస్తూంటాం. కనుక మహిళలకు గుండె పోటు రాదు అనుకోకండి. లక్షణాలు వేరుగా వుండి మనం దానిని కనిపెట్టలేము. గుండెను ఆరోగ్యంగా, సురక్షితంగా వుంచుకోటానికి మహిళలకు కూడా ఎప్పటికపుడు పిరియాడికల్ చెక్ అప్ వుండటం శ్రేయస్కరం!