Aadavallu Meeku Johaarlu : శర్వానంద్, రష్మిక మందన్నలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ అదే పాత కథ, డైలాగ్స్, కామెడీ కావడంతో ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు. దీంతో ఈ సినిమా ఫ్లాప్ కాకపోయినా.. యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుందిం. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు గాను డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1వ తేదీ తరువాత ఈ సినిమా ఆ ఓటీటీ యాప్‌లో స్ట్రీమ్ అవుతుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావల్సి ఉంది.
మరోవైపు ఈ నెలలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు రిలీజ్‌కు ఉన్నాయి. కనుక అప్పటి వరకు ఈ సినిమా కొనసాగే అవకాశం లేదు. కనుక ఏప్రిల్ మొదటి వారంలో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. దీనిపై అధికారికంగా త్వరలోనే వివరాలను వెల్లడించనున్నారు.