Cloves : లవంగాలను చాలా మంది మసాలా దినుసుగా ఉపయోగిస్తుంటారు. వీటిని మసాలా కూరల్లో ఎక్కువగా వేస్తుంటారు. లవంగాలు చాలా ఘాటుగా ఉంటాయి. కనుక వీటిని నేరుగా తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిని అలాగే తినాలి. ముఖ్యంగా రాత్రి పూట రెండు లవంగాలను తిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లను తాగాలి. దీంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. లవంగాలను రాత్రి పూట తినడం వల్ల శరీరంలో సెరొటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది హ్యాపీ హార్మోన్. దీని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
2. లవంగాల్లో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ రాకుండా చూస్తాయి. షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
3. రాత్రి పూట లవంగాలను తినడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు.
4. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. దీనివల్ల దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి.
5. లవంగాలను తింటే నోట్లోని బాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. దంత సమస్యలు తగ్గుతాయి.