Acharya Chanakya : ఆచార్య చాణక్యుడు ఎంతో మేథావి. ఆయన మన జీవితం కోసం ఎన్నో విలువైన సూత్రాలను చెప్పాడు. అయితే చాణక్యుడు విద్యార్థులకు ఉపయోపడే కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా చెప్పాడు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించేందుకు, వారు ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని పాటిస్తే విద్యార్థులు అన్నింటా సులభంగా విజయం సాధించవచ్చు. ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. ఇక విద్యార్థుల కోసం చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
విద్యార్థులు తమ అందం గురించి అస్సలు పట్టించుకోకూడదు. తాము ఎలా ఉన్నా, ఎవరు ఏం కామెంట్ చేసినా దాని గురించి లోతుగా ఆలోచించుకోకూడదు. ఆ సమయాన్ని చదువుకు కేటాయించాలి. విద్యార్థులు అతిగా నిద్రపోకూడదు. అలా చేస్తే సోమరి పోతులుగా తయారవుతారు. అది చదువుకు ఆటంకం కలిగిస్తుంది. రోజుకు కావల్సినన్ని గంటలు నిద్రిస్తే చాలు. ఎక్కువ అవసరం లేదు. దీంతో చదువుల్లో యాక్టివ్గా ఉంటారు.
విద్యార్థులకు కోపం అసలు పనికిరాదు. కోపం ఉంటే మనస్సుకు శాంతి ఉండదు. శాంతి లేకపోతే చదువుపై ఏకాగ్రత కోల్పోతారు. దీంతో చదువుల్లో వెనుకబడేందుకు అవకాశం ఉంటుంది. కనుక కోపాన్ని వదిలేయాలి. ఏ విషయాన్ని పట్టించుకోకూడదు. దేని గురించి కూడా కోపం తెచ్చుకోకూడదు. అలాగే ఇతరుల వస్తువులపై ఆశ పడకూడదు. కొందరు తమ వస్తువులను ఆశ చూపి ప్రలోభాలకు గురి చేస్తారు. అప్పుడు చదువుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలా వస్తువులను ఆశ చూపి కొందరు చదవనీయకుండా చేస్తారు. కనుక ఇతరుల వస్తువులను చూసీ చూడనట్లు ఉండాలి. అంతేకానీ వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. అసూయ చెందకూడదు.
విద్యార్థినీ విద్యార్థులకు ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలగడం సహజం. ఆ వయస్సుకు అది కామన్. కానీ ఆ ఆకర్షణ మోజులో పడకూడదు. అలా పడితే ఇక చదువు ఏమాత్రం అబ్బదు. అది కెరీర్ను దారుణంగా దెబ్బ తీస్తుంది. కనుక విద్యార్థులు తమకు ఆ వయస్సులో కలిగే ఆకర్షణ సహజమే అని భావించి.. చదువుపై ధ్యాస పెట్టాలి. దీంతో చదువుల్లో రాణిస్తారు. విద్యార్థులు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకునేందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇతరులతో గంటలు గంటలు ముచ్చట్లు పెట్టడం, లేదంటే ఇతరులను కించ పరిచేలా అనుకరించడం వంటి పనులు మానేయాలి. అలా చేయడం వల్ల చదువుల్లో వెనుకబడతారు.
రోడ్లపై ఏది పడితే అది తినకూడదు. ఇంట్లో వండిన ఆరోగ్యవంతమైన ఆహారాన్నే తినాలి. దీంతో పోషకాహారం సరిగ్గా అందుతుంది. ఫలితంగా మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. ఉత్తేజంగా మారుతారు. చదువుల్లోనూ చురుగ్గా ఉంటారు. పరీక్షల్లో విజయం సాధిస్తారు. కనుక చదువు సరిగ్గా రావాలంటే పోషకాహారం కూడా ముఖ్యమేనని గుర్తించాలి. అన్ని పోషకాలను కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీంతో మెదడు వికసించి చదువుల్లో రాణిస్తారు. లేదంటే జ్ఞానం అంతగా రాదు.
నేటి తరుణంలో చదువుకు ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థులు తమకు వచ్చే పాకెట్ మనీని దుబారా ఖర్చు చేయకుండా దాచి పెట్టుకోవాలి. పొదుపు చేయడం నేర్చుకోవాలి. లేదంటే చదువుకు పనికొచ్చేవి చేయాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీతోపాటు ఇతరులు ఇచ్చే డబ్బును వృథా ఖర్చుపెట్టకుండా పొదుపు చేయాలి. లేదా చదువుకు పనికొచ్చేవి కొనాలి. దీంతో చదువుల్లో రాణిస్తారు. లేదంటే వృథా ఖర్చు పెరుగుతుంది. డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తారు. అదే అలవాటు అవుతుంది. చివరకు ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఖర్చు అలాగే పెడతారు. అది జీవితాన్నే నాశనం చేస్తుంది. కనుక డబ్బు విషయంలో పొదుపు అవసరం.
ఇలా విద్యార్థులు చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటించడం వల్ల చదువుల్లో రాణిస్తారు. ఎంతో భవిష్యత్తు ఉంటుంది. ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.