Allu Arjun : పుష్ప సినిమా తర్వాత దాదాపు మూడేళ్లపాటు అల్లు అర్జున్ పుష్ప2 సినిమా కోసం పని చేయగా, ఈ మూవీ ఎట్టకేలకి నేడు విడుదలవుతుంది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడగా, మూవీని ప్రతి ఒక్కరు ఆకాశానికి ఎత్తుతున్నారు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన అదిరిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే రిలీజ్‌కి ముందు బన్నీకి చాలా మంది విషెస్ తెలియజేశారు. వారందరిలో తన తనయుడు అయాన్ విషెస్ చెప్పిన తీరు బన్నీని కదిలించింది. ఒక కొడుకుగా తను తన తండ్రిని తలుచుకొని ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాడో అయాన్ ఓ లెటర్‌లో రాసుకొచ్చాడు. ఆ లెటర్ ను బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
లెటర్ లో అయాన్ ఇలా రాసుకొచ్చాడు… ” డియర్ నాన్న.. నేను మీ గురించి మరియు మీ విజయం గురించి ఎంత గర్వపడుతున్నానో చెప్పడానికి ఈ లెటర్ రాస్తున్నాను. నేను నీ కష్టాన్ని, ప్యాషన్ ను, డెడికేషన్ ను ఒకేసారి చూసాను. ఈరోజు మీకు చాలా స్పెషల్ రోజు.. ప్రపంచంలోనే గొప్ప నటుడి చిత్రం విడుదలైన ప్రత్యేక రోజు. నిన్ను నంబర్ 1గా చూస్తుంటే.. చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలోనే గొప్ప నటుడి సినిమా రిలీజ్ అవుతున్న వేళ మీ భావోద్వేగాలను నేను అర్థం చేసుకోగలను. పుష్ప 2 సినిమానే కాదు అదొక అద్బుతమైన ప్రయాణం. నీకు, నీ టీమ్ కు శుభాకాంక్షలు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నువ్వెప్పుడూ నా హీరో, నాకు ఆదర్శం
మీకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ నేనే ఎప్పుడూ నీ నంబర్ వన్ అభిమానిని. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ కదా.. కాదు వైల్డ్ ఫైరు.. ప్రపంచంలోనే అత్యంత గర్వపడుతున్న మీ కొడుకు బుజ్జి బాబుష అంటూ అయాన్ మనస్సుకు హత్తుకునేలా లేఖ రాసారు. దీనిని అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. నా కొడుకు అయాన్ ప్రేమ నా గుండెను తాకింది. ఇప్పటివరకు నేను సాధించిన అతిపెద్ద విజయాలలో ఇది ఒకటి. అలాంటి ప్రేమ లభించడం అదృష్టం.. చిన్న పిల్లాడు రాసిన లెటర్ లో ఏమైనా తప్పులు ఉంటే పట్టించుకోకండి” అంటూ బన్నీ తన పోస్ట్‌కి కామెంట్ పెట్టాడు.