Brahmamudi Serial Today December 5th Episode : బ్రహ్మముడి తాజా ఎపిసోడ్‌లో కళ్యాణ్ ఆఫీసుకి వెళుతున్న సమయంలో దుగ్గిరాల ఫ్యామిలీ గర్వపడేలా చేయాలని అప్పు అంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన అనామిక నీ మొగుడిని పనివాడిగా పంపిస్తున్నావా ఏంటి అని అంటుంది. అప్పుడు కోపంతో ఊగిపోయిన అప్పు పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తానంటుంది. అప్పుడు అనామిక.. నీ మొగుడు ఆ లిరిక్ రైటర్ దగ్గర పనివాడిగా చేస్తున్నాడు. మూడేళ్ల అగ్రిమెంట్ కూడా రాసుకున్నాడు. టీలు కాఫీలు అందిస్తూ అతనికి కాళ్లు పడుతూ సేవలు చేస్తున్నాడు అని అనామిక అనడంతో షాక్‌లో ఉంటుంది అప్పు. మరొకవైపు ధాన్యలక్ష్మి రుద్రాణి రెచ్చగొడుతూ ఉంటుంది. మరికొద్ది సేపట్లో అత్త కోడలు ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు అనగా ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనడంతో చచ్చిపో అని అంటుంది రుద్రాణి.
ఏం మాట్లాడుతున్నావ్ అనగా అవును నిజంగానే చచ్చిపో అని అంటుంది. ఇంతలోనే కావ్య, అపర్ణ సీతారామయ్య ఇంటికి వస్తారు. ఆ సమయంలో ధాన్యలక్ష్మి ఉరి వేసుకోబోతున్నట్లు హైడ్రామా ఆడుతుంది. అప్పుడు ధాన్యలక్ష్మీ అపర్ణ చెంప పగలగొడుతుంది. నిన్ను ఇంట్లో ఉంచుకున్నది నువ్వు ఈ ఇంటికి ఆడపడుచు అని కాదు. మామయ్య గారు తన స్నేహితునికి ఇచ్చిన మాట కోసం నిన్ను ఇంట్లో ఉంచుకున్నాము అంటుంది అపర్ణ. అసలు నీ కొడుకు ఈ స్థితికి రావడానికి కారణం నువ్వు కాదా, అప్పు నీ కోడలిగా ఒప్పు కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని నిలదీస్తుంది. అప్పుడు ఇందిరా దేవి ఈ మంద మాటలు విని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు. బుద్ది మార్చుకో అని అంటుంది.
చావాలి అనుకుంటే మేము రాక ముందే చావచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నావ్ అని అంటాడు. నాకు ఎవరు ఏమి చెప్పొద్దు. నా కొడుకు న్యాయం జరగకపోతే నేను చచ్చిపోతాను. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకపోతే నేను చచ్చిపోతాను అంటూ ఉరి వేసుకుంటున్నట్లు హై డ్రామా మొదలు పెడుతుంది. అప్పుడు అందరూ చెప్పిన వినిపించుకోకుండా ఆమె నాటకాలు ఆడుతూ ఉంటుంది. అదంతా చూసిన సీతారామయ్య గుండెపోటుతో ఒక్కసారిగా పడిపోతాడు. అతన్ని వెంటనే హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తారు. అప్పుడు ఇందిరాదేవి ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా చెట్టు అంత మనిషినీ కూలిపోయేలా చేసావు అని కుమిలి కుమిలి ఏడుస్తుంది.
నా ఇల్లు నా కోడళ్ళు నా కొడుకులు నా మనవరాలు అంటూ ఎప్పుడూ తపనపడే ఆయనను ఈ స్థితికి తీసుకు వచ్చావు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని ఏడుస్తూ మాట్లాడుతుంది ఇందిరాదేవి. ఈ చీడపురుగు మాటలు విని నువ్వు ఈరోజు ఇంత డ్రామా సృష్టించావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో చూడు అంటూ ఇందిరా దేవి తెగ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అప్పుడు మధ్యలో రుద్రాణి మాట్లాడడంతో నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేను చంపేస్తాను అని అంటుంది అపర్ణ. దీంతో బ్రహ్మముడి తాజా ఎపిసోడ్‌కి ఎండ్ పడుతుంది.