Allu Arjun : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానాలు ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం.. భీమ్లా నాయక్. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లను రాబడుతూ హిట్ టాక్‌తో ముందుకు దూసుకుపోతోంది. ఈ సినిమాపై ఇప్పటికే మహేష్ బాబు ట్వీట్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా గురించి ఇప్పటికే మాట్లాడారు.

చిరంజీవి, చరణ్ వేర్వేరు సందర్భాల్లో భీమ్లా నాయక్ గురించి మాట్లాడారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ మూవీపై ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. తన రివ్యూను షేర్ చేయలేదు. దీంతో ఈ మూవీపై అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారు..? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే పుష్ప సినిమా విడుదలైన కొత్తలో ఆ మూవీ గురించి అటు మెగాస్టార్ కానీ, ఇటు పవర్ స్టార్ కానీ ఏమీ మాట్లాడలేదు. దీంతో భీమ్లా నాయక్‌పై తాను కూడా మాట్లాడబోనని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. కనుకనే ఆయన ఇప్పటి వరకు సినిమా గురించి ఏమీ అనలేదని తెలుస్తోంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి అందరూ ఒకేసారి సినిమా గురించి మాట్లాడితే అప్పుడు భజన చేస్తున్నారు.. అనే ప్రచారం జరిగే అవకాశం ఉంది. కనుక అల్లు అర్జున్ ఆగారు.. అని కూడా అంటున్నారు. కాబట్టి నేడో, రేపో ఆయన సమయం చూసుకుని ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారని తెలుస్తోంది.