Anasuya : అనసూయ భరద్వాజ్.. కేవలం బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై కూడా దూసుకుపోతోంది. వరుస సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో మెరిసిన ఈమె తరువాత రవితేజ ఖిలాడి సినిమాలో అలరించింది. ఇక ఓ మళయాళ చిత్రంలోనూ ప్రస్తుతం ఈమె నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ అలరిస్తుంటుంది. ఈ క్రమంలోనే అనసూయకు చెందిన కొన్ని పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అనసూయ పింక్ కలర్ డ్రెస్ ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తున్నాయి. చూస్తుంటే అవి ఒక షో సందర్భంగా దిగినవి అని తెలుస్తోంది. ఇక ఈ ఫొటోల్లో అనసూయ గ్లామర్ షో తో పిచ్చెక్కిస్తోంది. సాధారణంగా టీవీ షోలలో తెలుగు యాంకర్లు ఎవరూ ఇంతలా గ్లామర్ షో చేయరు. కానీ అనసూయ ప్రత్యేకమనే చెప్పవచ్చు.
ఇక అనసూయ ఈ మధ్యకాలంలోనూ వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో ఈమెను చాలా మంది నెటిజన్లు విమర్శించారు. తరువాత తన గురించి ఫ్యాన్స్ పాజిటివ్‌గా పెడుతున్న ఫొటోలు, పోస్టులను ఈమె షేర్ చేసి వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈమె ప్రస్తుతం మళయాళంలో భీష్మ పర్వం అనే సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్యలో కీలకపాత్రను పోషించింది. దీంతోపాటు గోపీచంద్ పక్కా కమర్షియల్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి.