Anupama Parameswaran : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం.. రౌడీ బాయ్స్. ఈ మూవీకి గాను తాజాగా అఫిషియల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కాలేజ్ రాజకీయాల నేపథ్యంలో ఈ మూవీ కొనసాగుతుందని చిత్ర ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. అర్జున్ రెడ్డి మూవీ తరువాత పూర్తి స్థాయిలో కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న మూవీ కావడం, దిల్ రాజ్ నిర్మాత కావడంతో.. ఈ మూవీపై అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ తొలి సారిగా లిప్ కిస్ ఇచ్చింది. ఇందులో అలాంటి 3, 4 లిప్ కిస్ సీన్లు ఉన్నాయని సమాచారం. అయితే ఎన్నడూ లేనిది అనుపమ పరమేశ్వరన్ మరీ ఇంతగా రెచ్చిపోవడంతో నెటిజన్లు షాకవుతున్నారు. ఇక కొందరైతే ఆమెను బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
దిల్ రాజు వంటి బడా ప్రొడ్యూసర్ మూవీ కదా.. అందుకని ఏదైనా జరుగుతుందని, అనుపమ పరమేశ్వరన్ ఇలా లిప్ కిస్ పెట్టడం అందుకు ఉదాహరణ.. అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతి కానుగా విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో చూడాలి.