Anushka Shetty : సినీ ఇండస్ట్రీలో స్వీటీగా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి వెండితెరపై అరంగేట్రం చేసి దాదాపుగా 15 ఏళ్లకు పైగానే అవుతోంది. నాగార్జునతో కలిసి ఈ అమ్మడు సూపర్ సినిమాలో నటించింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఈమె నటించిన అరుంధతి, తరువాత వచ్చిన బాహుబలి ఈమెకు స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టాయి. అనుష్క శెట్టి గ్లామర్ షో చేసినా.. వివాదాలకు మాత్రం ఎల్లప్పుడూ దూరమే. ఇక ఈమె తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఉందని.. సినిమా చాన్స్ లు ఇస్తామని చెప్పి అమ్మాయిలను లొంగదీసుకుంటారని.. తాను తన కెరీర్ బిగినింగ్‌లో ఇది చూశానని.. అయితే తాను ప్రతి విషయంలోనూ కచ్చితంగా ఉంటానని అనుష్క తెలియజేసింది. తాను కరెక్ట్‌గా మాట్లాడుతానని, కనుక తనకు అలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని తెలిపింది.
ఇక తన మనస్తత్వం తెలిసి ఎవరూ తన దగ్గర క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడేవారు కాదని తెలిపింది. అనుష్క ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తోంది. మొన్నా మధ్య ఆమె నటించిన నిశ్శబద్ధం అనే సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం అనుష్క శెట్టికి సినిమా అవకాశాలు లేవు. ఇక పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు ఈమె ప్రతిసారీ సమాధానాన్ని దాటవేస్తూనే ఉంటుంది.