Avakaya Veg Fried Rice : ఆవ‌కాయ వెజ్ ఫ్రైడ్ రైస్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయాలి..!

Avakaya Veg Fried Rice : ఆవ‌కాయ వెజ్ ఫ్రైడ్ రైస్.. ఆవ‌కాయ‌తో చేసే ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అన్నం మిగిలిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా ఆవ‌కాయ ఫ్రైడ్ రైస్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఒక్క మెతుకు కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. త‌రుచూ ఒకేర‌కం ఫ్రైడ్ రైస్ తిని తిని బోర్ కొట్టిన వారు ఈ ఆవ‌కాయ ఫ్రైడ్ రైస్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ ఆవ‌కాయ వెజ్ ఫ్రైడ్ రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవ‌కాయ వెజ్ ఫ్రైడ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన చిన్న ఉల్లిపాయ – 1, క్యారెట్ తరుగు – పావు క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – 3, క్యాబేజి త‌రుగు – పావు క‌ప్పు, లైట్ సోయా సాస్ – ఒక టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, ట‌మాట కిచ‌ప్ – ఒక టీ స్పూన్, మామిడికాయ ప‌చ్చ‌డి – పావు క‌ప్పు, అన్నం – ఒక క‌ప్పు బియ్యంతో వండినంత‌, ఉప్పు – కొద్దిగా, స్ప్రింగ్ ఆనియ‌న్స్ – కొద్దిగా.

Avakaya Veg Fried Rice recipe in telugu very tasty easy to make
Avakaya Veg Fried Rice

ఆవ‌కాయ వెజ్ ఫ్రైడ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ‌, క్యారెట్, బీన్స్, క్యాబేజి త‌రుగు వేసి వేయించాలి.వీటిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ట‌మాట కిచ‌ప్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మామిడికాయ ప‌చ్చ‌డి వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత అన్నం, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత స్ప్రింగ్ ఆనియ‌న్స్ చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆవకాయ వెజ్ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts