Bendakaya Vepudu : మనం బెండకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బెండకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. బెండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతోచేసుకోదగిన వంటకాల్లో బెండకాయ వేపుడు కూడా ఒకటి. బెండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ బెండకాయ వేపుడును ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా బెండకాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా, కమ్మగా బెండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బెండకాయలు – పావుకిలో, అల్లం – పావు ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 4, పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, పసుపు – పావు టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – అర టీ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, మ్యాగీ మసాలా – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బెండకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా జార్ లో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. బెండకాయ ముక్కలను పూర్తిగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి వేయించాలి. తరువాత ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, పెరుగు వేసి కలపాలి. తరువాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత మ్యాగీ మసాలా వేసికలపాలి. తరువాత దీనిని మరో నిమిషం పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బెండకాయ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.