Bheemla Nayak : పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ థియేటర్లలో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ రెండు వారాల నుంచి ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాను మరికొద్ది రోజుల్లోనే ఓటీటీల్లో స్ట్రీమ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి గాను రెండు ప్రముఖ ఓటీటీ యాప్‌లు డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆ రెండు యాప్‌లలోనూ ఒకే తేదీ రోజు ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు.

భీమ్లా నాయక్ సినిమాకు గాను డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా యాప్‌లు సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ రెండు యాప్‌లలోనూ ఒకే తేదీ రోజు ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నారు. మార్చి 25వ తేదీన భీమ్లా నాయక్ తమ తమ యాప్‌లలో స్ట్రీమ్ అవుతుందని ఆయా సంస్థలు ప్రకటించాయి. దీంతో ఈ సినిమా ఓటీటీలో విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక భీమ్లా నాయక్‌లో రానా దగ్గుబాటి మరో కీలకపాత్రలో నటించారు. ఇందులో పవన్ పక్కన నిత్య మీనన్, రానా పక్కన సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమాకు గాను హిందీ వెర్షన్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దీంతో ఈ సినిమా త్వరలో హిందీలో విడుదల కానుంది. ఇక అయ్యప్పనుమ్ కోషియుమ్ అనే మళయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు. అయితే ఈ సినిమా మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.