Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం.. భీమ్లా నాయక్. ఈ మూవీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఫిబ్రవరి 25వ తేదీన విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఈ మూవీ విడుదల అవుతుందా.. కాదా.. అనే సందేహం ఉండేది. అయితే అందరి అనుమానాలను పటా పంచలు చేస్తూ ఈ మూవీని కచ్చితంగా ఫిబ్రవరి 25వ తేదీనే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే తాజాగా చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. భీమ్లా నాయక్ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఓటీటీ యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిత్రం విడుదల అయిన 35 రోజులకు.. అంటే.. ఏప్రిల్ 1వ తేదీ తరువాత ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై త్వరలో వివరాలు తెలుస్తాయి.
ఇక భీమ్లా నాయక్ చిత్రంలో రానా, నిత్య మీనన్ కీలకపాత్రలు పోషించారు. మళయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే ఈ మధ్య అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇప్పుడు భీమ్లా నాయక్ హక్కులను గనుక నిజంగానే కొనుగోలు చేసి ఉంటే.. అప్పుడు ఈ ఓటీటీ యాప్‌కు పెద్ద మైలేజ్ లభిస్తుందని చెప్పవచ్చు. దీంతో ఆ ప్లాట్‌ఫామ్‌కు తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గరవుతారు. ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు కూడా చేరుతారు. ఇప్పటికే భారత్‌లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్‌లలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది.