ఒక యువకుడు రైల్లో ప్రయాణిస్తూ ఎంట్రీ డోర్ దగ్గర డాన్స్ చేశాడు అయితే చేస్తున్నప్పుడు బయట ఉన్న పిల్లర్ కు తగిలి ట్రైన్ బయట పడిపోయాడు అయితే ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిలాష్ అనే 16 ఏళ్ల అబ్బాయి చెన్నైలో మాధవరంలో ఉంటాడు. ఫస్ట్ ఇయర్ హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. ఈ యువకుడు ఎలక్ట్రిక్ ట్రైన్ లో ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉంటాడు. ఓ రోజు వెళ్తుండగా డాన్స్ చేస్తూ అతని ఫోన్లో షూట్ చేయడం జరిగింది.
తన స్నేహితుడు ఈ వీడియోను షూట్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఫుట్ బోర్డు వద్ద డాన్స్ చేయడం చేస్తున్న సమయంలో ఎలక్ట్రిక్ పోల్ కి తగిలి తలకు గాయం అయింది అంతేకాకుండా ట్రైన్ బయటకు పడిపోయాడు ఇదంతా కేవలం కొన్ని సెకండ్లలో జరిగింది అయితే ఈ సంఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది పైగా అందరూ షాక్ కి గురవుతున్నారు.
ఈ సంఘటన జరిగిన వెంటనే అభిలాష్ ను చెన్నైలో ఉన్న రాజాజీ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు కేవలం గాయాలు అవడంతో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. రాయపురం పోలీసులు దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నిర్వహించారు. అదే విధంగా మైసూర్ దర్భాంగా ఎక్స్‌ప్రెస్ ఆగి ఉన్న ట్రైన్‌ను ఢీకొంది. ఈ సంఘటన కూడా చెన్నై దగ్గరలోనే చోటు చేసుకుంది. దాంతో 19 మందికి గాయాలు అవ్వగా 12 నుండి 13 కోచ్‌లు దెబ్బతిన్నాయి. అయితే దీనికి కారణం సిగ్నల్ సరిగా పని చేయకపోవడమే అని.. దాంతో ఈ విధంగా జరిగింది అని చెప్తున్నారు.
Never seen someone risking their life to twerk on the footboard of the train. pic.twitter.com/sTxSzoUmtB
— Godman Chikna (@Madan_Chikna) October 13, 2024