Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Chettinad Style Chicken : చెట్టినాడ్ స్టైల్ చికెన్ త‌యారీ ఇలా.. రుచి చూస్తే ఇదే కావాలంటారు..!

D by D
November 15, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Chettinad Style Chicken : చికెన్ తో మ‌నం ర‌క‌రకాల వెరైటీ వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చికెన్ చుక్కా కూడా ఒక‌టి. చికెన్ చుక్కా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ వంటి వాటిలోకి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. త‌రుచూ చికెన్ తో ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ చుక్కాను చెట్టినాడు స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చెట్టినాడు స్టైల్ చికెన్ చుక్కా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, సోంపు గింజ‌లు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, చికెన్ – అర‌కిలో, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్.

Chettinad Style Chicken recipe in telugu make it in restaurant style
Chettinad Style Chicken

చెట్టినాడు స్టైల్ చికెన్ చుక్కా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక సోంపు గింజ‌లు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి . త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి రంగు మారే వ‌రకు వేయించాలి. త‌రువాత చికెన్, ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. దీనిపై మ‌ర‌లా మూత పెట్టి చికెన్ లోని నీరంతా పోయే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ లోని నీరంతా పోయి చికెన్ మెత్త‌గా ఉడికిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి.

దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి, మిరియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కొద్దిగా నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కొత్తిమీర‌, మ‌రికొద్దిగా క‌రివేపాకు, త‌రిగిన ప‌చ్చిమిర్చి వేసి క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ చుక్కా త‌యార‌వుతుంది. ఈ విధంగా త‌యారు చేసిన చికెన్ చుక్కాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Chettinad Style Chicken
Previous Post

Green Tea Vs Black Tea : గ్రీన్ టీ వ‌ర్సెస్ బ్లాక్ టీ.. మ‌న శ‌రీరానికి ఏది మంచిది..?

Next Post

Vegetable Pocket Samosa : వెజిట‌బుల్ పాకెట్ స‌మోసా.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Related Posts

హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025
international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025
inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.