Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Chicken Liver Vepudu : చికెన్ లివ‌ర్ వేపుడు ఇలా చేస్తే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

D by D
June 14, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Chicken Liver Vepudu : మ‌నం చికెన్ తో పాటుగా చికెన్ లివ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దీనిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌ప‌స‌ర‌మ‌య్యే వివిధ పోష‌కాలు ఉంటాయి. ఈ చికెన్ లివ‌ర్ తో ఎక్కువ‌గా వేపుడు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. చికెన్ లివ‌ర్ తో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ చికెన్ లివ‌ర్ వేపుడును త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. కేవ‌లం అర‌గంట‌లోనే రుచిక‌ర‌మైన చికెన్ లివ‌ర్ వేపుడును త‌యారు చేసుకోవ‌చ్చు. రుచిగా, అందరికి న‌చ్చేలా ఈ చికెన్ లివ‌ర్ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ లివ‌ర్ వేపుడు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ లివ‌ర్ – అర కిలో, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, ల‌వంగాలు – 7, జీల‌క‌ర్ర -అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ఎండు కొబ్బ‌రి ముక్క‌- ఒక ఇంచు ముక్క‌, నూనె – 4 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, త‌రిగిన క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Chicken Liver Vepudu recipe in telugu make in this method
Chicken Liver Vepudu

చికెన్ లివర్ వేపుడు త‌యారీ విధానం..

ముందుగా చికెన్ లివ‌ర్ ను ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత దీనిని శుభ్రంగా క‌డిగి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో ధ‌నియ‌లు, ల‌వంగాలు, జీల‌క‌ర్ర‌, దాల్చిన చెక్క వేసి దోర‌గా వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు, అల్లం, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. త‌రువాత చికెన్ లివ‌ర్ ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ వేయించాలి.

ఇలా వేయించిన త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి మ‌రో 10 నిమిషాల పాటు వేయించాలి. లివ‌ర్ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత కారం, మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. వీటిని మ‌రో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ లివ‌ర్ వేపుడు త‌యార‌వుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ లివ‌ర్ వేపుడును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Chicken Liver Vepudu
Previous Post

Laddu For Anemia : ర‌క్తం బాగా త‌క్కువ‌గా ఉన్న‌వారు వీటిని రోజుకు ఒక‌టి తినండి.. ర‌క్తం చెప్ప‌లేనంత‌గా పెరుగుతుంది..!

Next Post

Pepper And Ghee : ఈ రెండింటిని క‌లిపి తీసుకుంటే.. కంటి చూపు ఎంత‌లా పెరుగుతుందంటే..?

Related Posts

sports

మ్యాచ్ ఆడే టైంలో క్రికెటర్లు వాడే వైట్ పౌడర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?

June 1, 2025
వినోదం

క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

June 1, 2025
హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!