Pepper And Ghee : పూర్వం మన పెద్దలకు వృద్ధాప్యం వచ్చాక మాత్రమే కంటి సమస్యలు వచ్చేవి. అప్పుడు కూడా కేవలం చిన్న చిన్న సమస్యలే ఉండేవి. కనుక వారు వయస్సు పైబడిన తరువాత మాత్రమే కళ్లద్దాలను వాడేవారు. కానీ ఇప్పుడు చిన్నతనం నుంచే కళ్లద్దాలను ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక మంది దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. కంటి చూపు సరిగ్గా ఉండడం లేదు. అలాగే ఇతర కంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే కంటి చూపును పెంచడంతోపాటు కంటి సమస్యలను తగ్గించడం కోసం ఒక మిశ్రమం బాగా పనిచేస్తుంది. దాన్ని ఎలా తయారు చేయాలి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కంటి చూపును పెంచేందుకు నెయ్యి, మిరియాల పొడి మిశ్రమం ఎంతగానో పనిచేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలను పోగొడుతుంది. అలాగే నెయ్యిలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల కణజాలాన్ని రక్షిస్తాయి. దీంతో కంటి సమస్యలు తగ్గుతాయి. ఇక మిరియాలలో పైపరైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల మిరియాలు కళ్లను సంరక్షిస్తాయని చెప్పవచ్చు.

ఒక ఈ రెండింటిని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసి రోజూ తీసుకోవాలి. ఒక టీస్పూన్ నెయ్యిలో పావు టీస్పూన్ మిరియాల పొడిని వేసి కలిపి ఆ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే సేవించాలి. తరువాత 30 నిమిషాల వరకు ఎలాంటి ఆహారాలు, ద్రవాలు తీసుకోరాదు. ఇలా చేస్తుంటే నెల రోజుల్లో చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. దీంతో కంటి చూపు పెరుగుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. కళ్లద్దాలను వాడేవారికి ఇక వాటి అవసరం ఉండదు.
అయితే నెయ్యి, మిరియాల పొడి రెండూ వేడి చేసే పదార్థాలు. కనుక వేడి శరీర స్వభావం ఉన్నవారు వేడికి తట్టుకోలేని వారు ఈ మిశ్రమాన్ని వాడకపోవడమే మంచిది. ఇతరులు ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు. దీంతో కంటి చూపు మెరుగు పడడంతోపాటు కంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ మిశ్రమంతో ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.