Chicken Sherva : చికెన్ షేర్వాను ఇలా చేసి ఇడ్లీల‌తో క‌లిపి తినండి.. టేస్ట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది..

Chicken Sherva : చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. చికెన్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల వంట‌కాల్లో చికెన్ షేర్వా కూడా ఒక‌టి. అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా ఈ షేర్వాను తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే చికెన్ షేర్వా కూర‌ను సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ షేర్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – పావు కిలో, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ట‌మాట – 1, త‌రిగిన ఉల్లిపాయ – 1, గ‌రం మ‌సాలా – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన మిరియాలు – ఒక టీ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Chicken Sherva recipe in telugu tastes better with idli
Chicken Sherva

చికెన్ షేర్వా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత చికెన్, ప‌సుపు, ఉప్పు, కారం, గ‌రం మ‌సాలా, మిరియాల పొడి, సోంపు పొడి వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత రెండు గ్లాసులు నీళ్లు, కొత్తిమీర‌, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి చికెన్ మెత్త‌గా అయ్యే వ‌ర‌కు పూర్తిగా ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ షేర్వా త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, దోశ‌, ఇడ్లీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే చికెన్ వంట‌కాల‌తో పాటు ఇలా అప్పుడ‌ప్పుడూ చికెన్ షేర్వాను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts