Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేవలం నటుడిగానే కాదు.. ఆయన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో మంది గుండెల్లో నిలిచారు. తన పేరును మంచి కార్యక్రమాలకు వాడుకుంటే చిరంజీవి ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తారు. ఇక కొందరు నటీనటులు, హీరోలు చిరంజీవి పేరును సినిమాల్లోనూ వాడుకుంటుంటారు. అభిమానంతో వారు అలా చేస్తారు. అందుకు కూడా చిరంజీవి ఎవర్నీ ఏమీ అనరు. కానీ తనను మోసం చేయాలని చూస్తే మాత్రం ఆయన విడిచిపెట్టరు. ఇక తన చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ విషయంలోనూ ఆయన ఇలాగే చేశారట.
చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త మెగా ఫ్యామిలీకి అల్లుడు అయ్యాక.. ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ పెద్ద హిట్ కాలేదు. అయితే మెగా ఫ్యామిలీకి అల్లుడు కనుక ఆయన చిరంజీవి పేరును సినిమాల్లో వాడుకోవచ్చు. అంత వరకు ఓకే. కానీ ఆ ఫ్యామిలీని కల్యాణ్ దేవ్ మోసం చేసే యత్నం చేశాడట. చిరంజీవి చెప్పకున్నా.. ఆయన చెప్పినట్లు ఒక డైరెక్టర్‌ను కల్యాణ్‌దేవ్ ఇంటికి పిలిచారట. తనతో సినిమా చేయాలని అడిగారట.
దీంతో ఈ విషయం చిరంజీవికి తెలిసి ఆయన కల్యాణ్ దేవ్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఇకపై అలాంటి పనులు చేయవద్దని గట్టిగా చెప్పారట. సినిమాల్లో తన పేరును వాడుకోవడం ఓకే. కానీ తన పేరును అడ్డం పెట్టుకుని ఒకరిని ఏదైనా పనిచేయమని చెప్పి బలవంతం చేయొద్దని ఆయన కల్యాణ్‌కు గట్టిగానే క్లాస్ పీకారట. దీంతో ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న కల్యాణ్ దేవ్ శ్రీజతో కూడా సరిగ్గా ఉండడం లేదట. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి వీరి విడాకుల విషయం తెరమీదకు వస్తోంది. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే. వీటిలో నిజం ఎంత ఉంది ? అనేది తెలియాల్సి ఉంది.