Cooking Mutton : మనలో చాలా మంది నాన్ వెజ్ ను ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ ప్రియులకు వాటి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చికెన్, మటన్, పిష్, రొయ్యలు ఇలా వీటిని ఇష్టంగా తినే వారు మనలో చాలా మంది ఉన్నారు. నాన్ వెజ్ వంటకాలు రుచిగా ఉన్నప్పటికి వీటిని వండడం మాత్రం కొద్దిగా కష్టం, శ్రమ, సమయంతో కూడుకున్న పనే అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా మటన్ ను వండడానికి మనం మరింత శ్రమించాల్సి ఉంటుంది. లేత మటన్ త్వరగా ఉడికినప్పటికి ముదురు మటన్ మాత్రం ఉడకడానికి మరింత సమయం పడుతుంది. గంటల తరబడి ఉడికించినప్పటికి మటన్ త్వరగా ఉడకదు. మటన్ ను ఉడికించడానికి సమయం ఎక్కువగానే పడుతుంది. అలాగే మనం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది.
గ్యాస్ కూడా ఎక్కువగా పడుతుంది. అయితే కొన్ని చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా మటన్ ను ఉడికించుకోవచ్చు. ఈ చిట్కాలను వాడడం వల్ల మటన్ చాలా త్వరగా ఉడుకుతుంది. మనం సమయం అలాగే గ్యాస్ కూడా ఆదా అవుతుంది. మటన్ ను త్వరగా ఉడికించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేతులతో గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తగినంత రాళ్లు ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత వండుకోవాలి. ఇలా చేయడం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది. అలాగే షుగర్ వేయకుండా టీ పొడి వేసి డికాషన్ ను తయారు చేసుకోవాలి.ఈ డికాషన్ ను మటన్ లో పోసి అరగంట నుండి గంట పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా మటన్ త్వరగా ఉడుకుతుంది.
అదే విధంగా ఆమ్ల గుణం కలిగి ఉండే టమాటాలు కూడా మటన్ ను త్వరగా ఉడికేలా చేస్తాయి. మటన్ ను తాళింపు వేసేటప్పుడే టమాట ముక్కలను వేయడం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది. అదే విధంగా పచ్చి బొప్పాయిని ఉపయోగించడం వల్ల కూడా మటన్ త్వరగా ఉడుకుతుంది. మటన్ వండేటప్పుడు కొన్ని పచ్చి బొప్పాయి ముక్కలను వేయాలి. ఇలా చేయడం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది. మటన్ త్వరగా ఉడకాలంటే మటన్ తాళింపు వేసేటప్పుడు అల్లం తురుమును వేయాలి.
దీనిలో ఉండే ఎంజైమ్ లు మటన్ త్వరగా ఉడికేలా చేస్తాయి. అలాగే ఆమ్ల గుణం కలిగి ఉండే కివీ, ఫైనాఫిల్ వంటి పండ్లను ఉపయోగించిన మంచి ఫలితం ఉంటుంది. ఈ పండ్ల ముక్కలను కొద్ది మోతాదులో మటన్ వండేటప్పుడు వేస్తే మటన్ త్వరగా ఉడుకుతుంది. అలాగే మటన్ ను ఒక గంట పాటు పెరుగు లేదా మజ్జిగలో నానబెట్టడం వల్ల కూడా మటన్ త్వరగా ఉడుకుతుంది. ఈ చిట్కాలను వాడడం వల్ల మటన్ మరలా మరలా ఉడికించే పని ఉండదు.