Disha Patani : హీరోయిన్స్ సోషల్ మీడియాలో తమ అభిమానులకు ఎల్లప్పుడూ టచ్‌లో ఉంటుంటారు. అందులో భాగంగానే తమకు సంబంధించిన ఫొటోలను, సినిమా అప్‌డేట్స్‌ను, వ్యక్తిగత విషయాలను కూడా వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి లైవ్ లోకి వచ్చి తమ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు కూడా వారు సమాధానాలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో హీరోయిన్లకు పలు చిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వారు కూడా వాటికి దీటుగానే బదులు చెబుతుంటారు. ఇక బాలీవుడ్ బ్యూటీ దిశా పటానికి కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

దిశా పటాని తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ ద్వారా తన ఫ్యాన్స్ ముందుకు వచ్చింది. ఈక్రమంలోనే వారితో ఆమె చిట్ చాట్ నిర్వహించింది. వారు అడిగిన ప్రశ్నలకు ఆమె ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. అయితే ఒక నెటిజన్ మాత్రం తనకు దిశా పటాని వేసుకున్న మంచి బికినీ ఫొటో కావాలని నేరుగా ఆమెనే అడిగేశాడు. దీంతో ఆమె ఈ ప్రశ్నకు షాకైంది. అయినా వెంటనే తేరుకుని బికినీ వేసుకున్న ఓ పాండా లాంటి జంతువు ఫొటోను ఆమె షేర్ చేసింది. దీంతో ఆ నెటిజన్ ఖంగు తిన్నాడు. ఈ క్రమంలోనే ఆమె ఇచ్చిన ఈ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక దిశా పటాని తెలుగులో లోఫర్ అనే మూవీలో వరుణ్ తేజ్ పక్కన నటించింది. ఆ తరువాత తెలుగులో మళ్లీ ఈ భామ సినిమాలు చేయలేదు. కానీ బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఈమె బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం కూడా నడిపిస్తోంది. ఈ క్రమంలోనే వీరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. బాగి సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిందని చెబుతుంటారు. మరి వీరి వివాహం ఎప్పుడు అవుతుందో చూడాలి.