Bird Nest : పక్షులు గూళ్లు కట్టుకుని వాటిల్లో నివసిస్తాయని మనందరికీ తెలుసు. కొన్నిసార్లు పక్షులు మన ఇళ్లల్లో గూళ్లు కట్టుకుంటూ ఉంటాయి. అయితే మనలో చాలా మంది పక్షులు ఇంట్లో గూళ్లు కట్టుకోవడాన్ని అరిష్టంగా భావిస్తారు. మనకు ఉండే ఐదు యజ్ఞాలలో భూత యజ్ఞం కూడా ఒకటి. మన చుట్టూ ఉండే పశుపక్ష్యాదులకు మన స్థోమతకు తగినట్టుగా ఆహారాన్ని ఇవ్వడమే భూత యజ్ఞం. పశు పక్ష్యాదులను చేర దీసి వాటికి ఆహారాన్ని ఇవ్వడం యజ్ఞం చేసిన దానితో సమానమని పెద్దలు చెబుతున్నారు.
పూర్వకాలంలో రైతులు ఇంటి ముందు ధాన్యపు కంకులను వేలాడదీసే వారు. ఈ విధంగా వారు పక్షులకు ఆహారాన్ని అందించే వారు. పక్షులకు ఆహారాన్ని అందించడం, నివాసం కల్పించటం ఎంతో పుణ్యంతో కూడుకున్న పనులని పెద్దలు చెబుతున్నారు. ఎవరికి ఉన్న వీలులో వారు పక్షులకు ఆహారాన్ని, నీరును అందించడం వల్ల యజ్ఞం చేసినంత ఫలితం మనకు వస్తుందని చెబుతున్నారు. పూర్వ కాలంలో చాలా మంది ఇలా పాటించేవారు. కానీ ఇప్పుడు సిటీ కల్చర్ కారణంగా దీన్ని మరిచిపోయారు.
మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది ఇలా పక్షులు, జంతువులకు ఆహారం పెడుతూ.. నీటిని అందిస్తూ కనిపిస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. అంతేకానీ.. పక్షి గూళ్లు ఇంట్లో ఉండడాన్ని అరిష్టంగా భావించవద్దు. వాటికి నీడ కల్పించడంతోపాటు ఆహారం, నీరు ఇస్తే ఇంకా ఎంతో మంచిది. మనకు దైవం ఆశీస్సులు లభిస్తాయి. మనం సమస్యల నుంచి బయట పడవచ్చు. కనుక ఎవరికి వీలున్న రీతిలో వారు పశువులకు, పక్షులకు నీరు, ఆహారం అందించడం ఎంతో మేలు చేస్తుంది.