Rice : దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారికి బియ్యమే ప్రధాన ఆహారం. కనుక ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బియ్యం ఉంటాయి. బియ్యంతో వండిన అన్నాన్ని మనం ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ బియ్యాన్ని కొందరు నెలకు సరిపడా, కొందరు ఆరు నెలలకు సరిపడా, కొందరు సంవత్సరానికి సరిపడా నిల్వ చేసుకుంటారు. ఇలా నిల్వ చేసుకునే బియ్యాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఒక పరిష్కారాన్ని చేయడం వల్ల అవి మనకు, మన కుటుంబ సభ్యులకు లాభాన్ని చేకూర్చుతాయి. ఈ పరిష్కారాన్ని చేయడం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.
బియ్యం ఇంటికి తెచ్చుకున్న వెంటనే చేయవలసిన పరిష్కారం ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం ఇంటికి తెచ్చుకున్న వెంటనే అందులో నుండి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకుని వాటిని ఇష్ట దైవం ముందు ఉంచి కళ్లు మూసుకుని ఓ దేవా వీటిని గ్రహించు, ఇంటిల్లిపాదీ సంతోషంగా ఉండేలా చూడు, నీ సమస్త శక్తులన్నింటినీ వీటిలో నింపి ఆర్థిక పరమైన సమస్యలు దూరం అయ్యేలా మార్గం చూపు.. అని భగవంతున్ని వేడుకుని ఆ బియ్యాన్ని తీసుకుని మిగిలిన బియ్యంలో కలుపుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఆ బియ్యంలో మంచి గుణాలు చేరుతాయి. ఈ బియ్యాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల లేదా వీటిని తినడం వల్ల ఇంట్లోని వారందరికీ లాభాలు, మంచి ఫలితాలు అందుతాయి. బియ్యాన్ని ఇంటికి తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా చేసిన తరువాతే వాటిని తినడానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వారందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.