బర్త్ డే వేడుకలను చాలా మంది అట్టహాసంగా జరుపుకుంటారు. పూర్వకాలంలో బర్త్ డే వేడుకలు అంటే ఉదయం లేచి తలారా స్నానం చేసి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునే వారు. జన్మదినం సందర్బంగా పేదలకు అన్నదానం లేదా ఇతర కార్యక్రమాలను చేసేవారు. కానీ ఇప్పుడు కల్చర్ మారింది. అర్థరాత్రి నడిరోడ్డు మీద బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేసి హంగామా సృష్టిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ కేక్ కట్ చేయడానికి ముందు ఎవరైనా సరే క్యాండిల్స్‌ను ఊదుతారు. కానీ ఇలా చేయడం చాలా హానికరం అని పరిశోధకులు చెబుతున్నారు.
సాధారణంగా బర్త్ డే కేక్‌ను కట్ చేసేందుకు ముందు క్యాండిల్స్‌ను ఊదుతారు. అయితే ఇలా ఊదినప్పుడు నోట్లోని బాక్టీరియా కేక్ మీద పడుతుందట. దీంతోపాటు కొవ్వొత్తి కరిగి అందులోని రసాయనాలు కూడా కేక్ మీద చేరుతాయట. దీంతో అలాంటి కేక్‌ను తింటే ఆరోగ్యానికి హానికరం అని పరిశోధకులు చెబుతున్నారు.
కనుక బర్త్ డే సెలబ్రేషన్స్‌ను చేసుకోండి.. కానీ కేక్‌ను సింపుల్‌గా కట్ చేయండి. క్యాండిల్స్‌ను ఊదడం చేయకండి. లేదంటే కేక్ ద్వారా బాక్లీరియా మన శరీరంలోని ప్రవేశిస్తుంది. కనుక ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి.