Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Godhuma Ravva Kesari : గోధుమ ర‌వ్వ కేస‌రి.. క‌మ్మ‌గా, రుచిగా రావాలంటే ఇలా చేయాలి..!

D by D
December 18, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Godhuma Ravva Kesari : మ‌నం గోధుమ‌ర‌వ్వ‌తో వివిధ ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. గోధుమ ర‌వ్వ‌తో చేసే తీపి వంట‌కాల్లో గోధుమ ర‌వ్వ కేస‌రి కూడా ఒక‌టి. గోధుమ ర‌వ్వ‌తో చేసే ఈ కేస‌రి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా ప్ర‌సాదంగా దీనిని త‌యారు చేస్తూ ఉంటారు. చాలా మంది ఈ కేస‌రిని ఇష్టంగా తింటారు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. 15 నుండి 20 నిమిషాల్లోనే దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. బెల్లంతో రుచిగా, క‌మ్మ‌గా గోధుమ ర‌వ్వ కేస‌రిని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోధుమ ర‌వ్వ కేస‌రి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, స‌న్న‌గా ఉండే గోధుమ ర‌వ్వ – ఒక క‌ప్పు, నీళ్లు – 2 క‌ప్పులు, బెల్లం తురుము – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, నేతిలో వేయించిన జీడిప‌ప్పు – కొద్దిగా.

Godhuma Ravva Kesari recipe very tasty how to make it
Godhuma Ravva Kesari

గోధుమ ర‌వ్వ కేస‌రి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత గోధుమ‌ర‌వ్వ‌ను వేసి వేయించాలి. దీనిని కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత వేయించిన రవ్వ వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ర‌వ్వ‌ను మెత్త‌గా ఉడికించాలి. ర‌వ్వ ఉడికిన త‌రువాత బెల్లం తురుము వేసి క‌లుపుతూ ఉడికించాలి. బెల్లం క‌రిగి ర‌వ్వ మ‌రలా దగ్గ‌ర ప‌డిన త‌రువాత రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి క‌లుపుతూ ఉడికించాలి. త‌రువాత యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన జీడిప‌ప్పు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ ర‌వ్వ కేస‌రి త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా గోధుమ ర‌వ్వ‌తో రుచిగా, శ‌రీరానికి మేలు చేసేలా కేసరిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Tags: Godhuma Ravva Kesari
Previous Post

Sleep : రోజూ స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా..? అయితే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

Next Post

Noodles Pakoda : నూడుల్స్ ప‌కోడాల‌ను ఎంతో క‌మ్మ‌గా, రుచిగా ఇలా చేసుకోవ‌చ్చు.. ఎలా చేయాలంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

July 4, 2025
ఆధ్యాత్మికం

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

July 4, 2025
vastu

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

July 4, 2025
వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.