Gongura Kura : గోంగూర‌ను కూర‌లా ఇలా చేసి తింటే.. వ‌హ్వా.. అంటారు..!

Gongura Kura : ఆకుకూరైన‌టువంటి గోంగూర‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. గోంగూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. గోంగూర‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్ ఎ, బి6, సి వంటి విట‌మిన్స్ క్యాల్షియం, ఐర‌న్, జింక్ వంటి మిన‌ర‌ల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగా ఉంటాయి. గోంగూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. గోంగూర‌తో మ‌నం ప‌చ్చ‌డి, ప‌ప్పు వంటి వంట‌కాల‌ను ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఈ గోంగూర‌తో మ‌నం కూర‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. అమ్మ‌మ్మ‌ల కాలంలో ఈ కూర‌ను ఎక్కువ‌గా త‌యారు చేసే వారు. గోంగూర‌తో చేసే కూర చాలా రుచిగా ఉంటుంది. పాత కాలంలో త‌యారు చేసే విధంగా గోంగూర‌తో కూర‌ను ఎలా త‌యారు చేస‌కోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోంగూర – 3 క‌ట్టలు ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ప‌చ్చిమిర్చి – 8 , చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బ‌లు -10, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండు కారం – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – ఒక టీ గ్లాస్, ప‌సుపు – పావు టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ధ‌నియాలు – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఎండుమిర్చి -5.

Gongura Kura recipe in telugu tastes better with rice
Gongura Kura

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టీ స్పూన్స్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, శ‌న‌గ‌పప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – పావు టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

గోంగూర కూర త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో మెంతులు, ధ‌నియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. తరువాత ఒక క‌ళాయిలో గోంగూర‌ను వేసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌న్నీ కూడా వేసి గోంగూర‌ను ఉడికించుకోవాలి. గోంగూర‌లోని నీరు అంతా పోయి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికి గోంగూర ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత ప‌ప్పు గుత్తితో గోంగూర‌ను, ప‌చ్చిమిర్చిని, ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌లిపి మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన త‌రువాత దీనిని ముందుగా త‌యారు చేసుకున్న గోంగూర మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర త‌యార‌వుతుంది. ఈ గోంగూర కూర‌ను వేడి వేడి అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎంత తిన్నామో తెలియ‌కుండానే ఈ గోంగూర కూర‌ను మొత్తం తినేస్తారు. గోంగూర‌తో ప‌చ్చ‌డి, ప‌ప్పునే కాకుండా ఇలా కూర‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts